ETV Bharat / city

స్వస్థలాలకు వలస కూలీలు.. పాటించాల్సిన మార్గదర్శకాలు - ఏపీ లాక్​డౌన్ ఎఫెక్ట్

స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలకు ప్రభుత్వ మార్గదర్శకాలు
స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలకు ప్రస్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలకు ప్రభుత్వ మార్గదర్శకాలుభుత్వ మార్గదర్శకాలు
author img

By

Published : May 2, 2020, 9:40 AM IST

Updated : May 2, 2020, 10:57 AM IST

09:03 May 02

ప్రభుత్వ మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. రాష్ట్రంలోని వలస కూలీలు 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.  గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే రాకపోకలకు  అనుమతి ఇస్తామని తెలిపారు. శిబిరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. బస్సులో 50 శాతానికి మించకుండా తరలించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.  

మార్గదర్శకాలు

స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్​లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. అనంతరం మరో 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలిపింది. ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ బృందం మొత్తాన్ని క్వారంటైన్​లో ఉంచాలని తెలిపింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చింది. ఇతర రాష్ట్రాల్లో  ఉన్న వారి గురించి ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలన్న ప్రభుత్వం... ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వేస్టేషన్ గుర్తించాలని ఆదేశాలు జారీచేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి తీసుకోవాలని సూచించింది.  అధికారులు అనుమతిచ్చిన రైల్వేస్టేషన్, బస్టాండ్ చేరేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.  

వచ్చిన వారికి స్క్రీనింగ్​తో సహా, పూర్తి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ నుండి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించింది. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటైన్​కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించింది.  

Last Updated : May 2, 2020, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.