ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎక్కడా చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే కోరామని చెప్పారు. తమ వాదనలు వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకుందన్నారు. తమకు న్యాయం జరగలేదన్న ఆయన.. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు. సీఎస్‌ను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకుంటామని తెలిపారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీ వేయవద్దని.. ఎన్నికల విధుల్లో కరోనాతో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో వైరం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనే మమ్మల్ని వివాదంలోకి లాగిందని.. ఆ తరువాతే తాము మాట్లాడామని వివరించారు. ఉద్యోగ సంఘాలపై కొందరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !