స్మార్ట్ఫోన్ల రివర్స్ టెండరింగ్లో రూ.83 కోట్లు ఆదా చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా... స్మార్ట్ ఫోన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 2 లక్షల 64 వేల ఫోన్ల కొనుగోలు టెండర్లలో గతంలో రూ.317 కోట్లకు బిడ్లు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. సోమవారం జరిగిన ఆక్షన్లో రూ.233 కోట్లకే ఫోన్లు సరఫరా చేసేందుకు ఓ సంస్థ ముందుకొచ్చిందని ప్రభుత్వం తెలిపింది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లలో 26.4 శాతం ప్రజాధనం ఆదా అయ్యిందని ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ చదవండి :