ETV Bharat / city

కరోనాకు భయపడొద్దు : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కొవిడ్ విషయంలో ఆందోళన పడకుండా ..వైద్య నిపుణులు, సలహాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన రాష్ట్ర ప్రజలకు సందేశమిచ్చారు.

ap governor
ap governor
author img

By

Published : Jul 24, 2020, 7:17 AM IST

‘కరోనాపై ఆందోళన వద్దు, వైద్య నిపుణుల సలహాలు, సూచనలను కచ్చితంగా పాటించాలి. ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి’ అని రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు. వైద్యపరంగా ఎంతో ముందున్న దేశాలు సైతం కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇబ్బందిపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మహమ్మారి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపారు.

కరోనా బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, చికిత్సకు అన్ని వైద్య సదుపాయాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని వివరించారు. మానవ నైపుణ్యం, చాతుర్యం, ఆవిష్కరణ సామర్థ్యం.. త్వరలోనే కొవిడ్‌-19కు పరిష్కారాన్ని చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో మొదటి వరుసలో ఉండి సేవలందిస్తున్న వైద్యులు, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన రెడ్‌క్రాస్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యక్తులకు అభినందనలు తెలిపారు.

గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన రాష్ట్ర ప్రజలకు సందేశమిచ్చారు. గవర్నర్‌ పర్యటనల సమయంలో ఎర్రతివాచీలు పరచడం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం వంటి ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన అనవసర ఖర్చుతో కూడిన సంప్రదాయాలను వదిలేయాలని తానిప్పటికే అధికారులకు స్పష్టం చేశానని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల కార్యక్రమాలకు తాను హాజరవుతున్నప్పుడు మొక్కలు నాటడం, రక్తదానం వంటి కార్యక్రమాలను తప్పనిసరి చేశానని పేర్కొన్నారు

ఇదీ చదవండి:

రైతులు ఇచ్చిన భూముల్లో అమ్మకానికి 1600 ఎకరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.