ETV Bharat / city

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం - ఏపీ రాజధాని బిల్లులు వార్తలు

ap-governor-approved-crda-and-decentralization-of-capital-bills
http://10.10.50.8ap-governor-approved-crda-and-decentralization-of-capital-bills5:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/01-August-2020/8245009_523_8245009_1596238670612.png
author img

By

Published : Jul 31, 2020, 3:52 PM IST

Updated : Aug 1, 2020, 5:09 AM IST

15:49 July 31

రాజముద్ర

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని బిల్లులపై ఉత్కంఠకు తెరదించుతూ.. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృతాభివృద్ధి చట్టాన్ని (యాక్ట్‌ నం.28 ఆఫ్‌ 2020) రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌లో ప్రచురించింది. దీని ప్రకారం అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. అలాగే.. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా (ఏఎంఆర్‌డీఏ)గా రూపాంతరం చెందనుంది. ఈ మేరకు మరో కొత్త చట్టాన్ని (యాక్ట్‌ నం.27 ఆఫ్‌ 2020) ఆంధ్రప్రదేశ్‌ రాజపత్రంలో ప్రభుత్వం ప్రచురించింది. కొత్త చట్టం ప్రకారం ఇకపై సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న ప్రాంతమంతా ఏఎంఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది, దాన్ని ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.

రెండు వారాల కసరత్తు

రాజధాని బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి ముందు.. బిల్లులు ప్రవేశపెట్టిన విధానం, నాడు చోటుచేసుకున్న పరిణామాలపై శాసనసభ కార్యదర్శి నుంచి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నివేదిక రప్పించుకున్నారు. దిల్లీలోని న్యాయ నిపుణులనూ సంప్రదించారు. దాదాపు రెండు వారాల కసరత్తు తర్వాత ఆ బిల్లులను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు బిల్లులను జులై 18న గవర్నర్‌ ఆమోదం కోసం శాసనసభ కార్యదర్శి పంపారు. వాటిని ఆమోదించవద్దని రాజధాని రైతులు, అమరావతి ఐక్య కార్యాచరణ సమితి, ప్రధాన ప్రతిపక్షం తెదేపా సహా పలు రాజకీయ పార్టీలు గవర్నర్‌ను కోరాయి. బిల్లులను సెలక్టు కమిటీకి పంపించాలని శాసనమండలి ఛైర్మన్‌ ఆదేశించారని, వాటిపై హైకోర్టులో వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయని గవర్నర్‌ దృష్టికి తెచ్చాయి. ఆ బిల్లులు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని, కాబట్టి వాటిపై నిర్ణయం తీసుకునే ముందు అటార్నీ జనరల్‌ సలహా తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఆ బిల్లులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని న్యాయశాఖకు గవర్నర్‌ పంపించారు. అక్కడినుంచి మళ్లీ అవి గవర్నర్‌కు చేరాయి. చివరకు బిల్లులను గవర్నర్‌ ఆమోదించారు.

మొదటి నుంచీ వివాదాస్పదం

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా తీవ్రంగా వ్యతిరేకించినా, శాసనసభలో ఆధిక్యం ఉండటంతో బిల్లులు ఆమోదం పొందాయి. అక్కడి నుంచి అవి శాసనమండలికి వచ్చాయి. వాటిని ప్రవేశపెట్టినప్పుడు దాదాపుగా మంత్రులంతా మండలిలో ఉన్నారు. కానీ ఎగువసభలో మెజార్టీ ఉన్న తెదేపా ఆ బిల్లులను వ్యతిరేకించింది. తీవ్ర గందరగోళం, నాటకీయ పరిణామాల మధ్య ఆ బిల్లులను సెలక్టు కమిటీకి పంపిస్తున్నట్టుగా మండలి ఛైర్మన్‌ ప్రకటించారు. సెలక్టు కమిటీలను నియమించాలని ఛైర్మన్‌ ఇచ్చిన ఆదేశాలను శాసనసభ కార్యదర్శి పాటించలేదు. జూన్‌ 17న ఆ బిల్లులను ప్రభుత్వం మరోసారి శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. అదేరోజు మళ్లీ మండలికి పంపింది. అక్కడ ఆ బిల్లులను ప్రవేశపెట్టకుండానే సభ వాయిదా పడింది. బిల్లులు రెండోసారి మండలికి వెళ్లాక, అక్కడ ప్రవేశపెట్టకపోయినా నెల రోజుల్లో ఆమోదం పొందినట్టేనన్న నిబంధన మేరకు.. జులై 18న వాటిని గవర్నర్‌ ఆమోదానికి శాసనసభ కార్యదర్శి పంపించారు.

శాసనసభలో సీఎం ప్రసంగంతో..

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని నిర్మాణ పనుల్ని నిలిపివేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై సిఫారసుల కోసం.. 2019 సెప్టెంబరులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.ఎన్‌.రావు సారథ్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. సీఎం డిసెంబరు 18న శాసనసభలో ప్రసంగిస్తూ మొదటిసారి మూడు రాజధానుల ప్రతిపాదనను సూచనప్రాయంగా బయటపెట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై అధ్యయనానికి బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ని నియమించినట్టు ఆయనే సభలో తెలిపారు. తర్వాత జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ల నివేదికలు వచ్చాయి. ఆ రెండు నివేదికలూ మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుగుణంగానే ఉన్నాయి. వాటిపై నియమించిన మంత్రులు, అధికారుల కమిటీ కూడా అటే మొగ్గింది.

కోర్టులో పలు వ్యాజ్యాలు

జి.ఎన్‌.రావు కమిటీ, మంత్రుల కమిటీల నియామకాన్ని, మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలని శాసనమండలి ఛైర్మన్‌ ఆదేశించిన తర్వాత కూడా, దానికి విరుద్ధంగా ఆ బిల్లులను మరోసారి శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ మరో వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుతం అవన్నీ విచారణలో ఉన్నాయి. ఆ బిల్లులు సెలక్టు కమిటీ వద్ద ఉన్నాయని ఒక సందర్భంలో అడ్వకేట్‌ జనరల్‌ కూడా కోర్టుకు తెలిపారు. మధ్యలో.. సచివాలయంలో తగినంత చోటు లేదంటూ విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోల పైనా హైకోర్టు స్టే ఇచ్చింది.

ఏపీఎంఆర్‌డీఏ చట్టంలోని ముఖ్యాంశాలు..

* సీఆర్‌డీఏ ఆస్తులు, అప్పులు, ప్రభుత్వ హామీతో జారీచేసిన బాండ్లు అన్నీ ఏఎంఆర్‌డీఏకి బదిలీ అవుతాయి.
* సీఆర్‌డీఏ చట్టం రద్దుకు ముందువరకు ఆ సంస్థలో నియమితులైన ఉద్యోగులంతా ఇకపై ఏపీఎంఆర్‌డీఏ పరిధిలోకి వస్తారు. కావాలనుకుంటే వారిని ఇతర స్థానిక సంస్థల్లో గానీ, ప్రభుత్వ విభాగాల్లో గానీ నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
* రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ విధానంలో భూములిచ్చిన రైతులందరికీ.. గత చట్టంలో చెప్పినట్లే వారికి కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేసి అప్పగించడంతో పాటు, ఇతర హామీలను ప్రభుత్వం అమలుచేస్తుంది.
* రాజధాని గ్రామాల్లోని భూమిలేని పేదలకు ఒక్కో కుటుంబానికీ ప్రస్తుతం ఇస్తున్న పింఛనును నెలకు రూ.5 వేలకు పెంచుతుంది. ఇదివరకు హామీ ఇచ్చిన పదేళ్ల కాలానికి, అదనంగా మరో ఐదేళ్లపాటు పింఛను కొనసాగిస్తుంది.
* -  ఏపీసీఆర్‌డీఏ జారీచేసిన టీడీఆర్‌ బాండ్లను ఇకపై ఏపీఎంఆర్‌డీఏ జారీచేసినట్టే భావిస్తారు.

మూడు రాజధానుల చట్టంలోని ముఖ్యాంశాలు..

* హైకోర్టును (ప్రిన్సిపల్‌ సీట్‌ ఆఫ్‌ హైకోర్టు) కర్నూలుకు తరలించేందుకు, విభజన చట్టం ప్రకారం బెంచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
* రాష్ట్రాన్ని ప్రాంతీయ జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. వాటి అభివృద్ధికి ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డులను ఏర్పాటుచేస్తుంది.
* ఈ చట్టం అమలుకు అవసరమైన అధికారాలతో పాటు, అవసరమైన ఇతర అధికారాలనూ బోర్డులకు కల్పిస్తుంది.
* జోన్‌ పరిధిలోని ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి నివేదికలు, సమాచారం రప్పించుకునే అధికారం బోర్డులకు ఉంటుంది.
* జోన్ల పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలను బోర్డులు సిఫారసు చేస్తాయి.

ఇదీ చదవండి

నెలలపాటు సాగింది బిల్లు వివాదం... ప్రభుత్వం నెగ్గించుకుంది పంతం...

Last Updated : Aug 1, 2020, 5:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.