ETV Bharat / city

వీఆర్డీఎల్, ట్రూనాట్ ల్యాబ్​లలో నమునా సేకరణ కౌంటర్లు - news on corona tests in ap

కరోనా పరీక్షల ఫలితాలు త్వరితగతిన రావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని వీఆర్డీఎల్ ల్యాబ్ లు, ట్రూనాట్ ల్యాబ్ లలో నమునా సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ల్యాబ్ లలో నమూనా ఫలితాలు వచ్చిన వెంటనే కోవిడ్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచనలు జారీ చేసింది. రెడ్ మార్కింగ్ చేసిన నమూనాలను ప్రాధాన్యతగా గుర్తించి తక్షణం ఫలితాలు ఇవ్వాలని సూచించింది.

ap government orders on covid results
కరోనా పరీక్షలు
author img

By

Published : Jul 14, 2020, 6:33 PM IST

కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని అన్ని వీఆర్డీఎల్ ల్యాబ్ లు, ట్రూనాట్ ల్యాబ్ లలో నమునా సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నమూనా సేకరణ కౌంటర్లూ మూడు షిఫ్టులూ పనిచేసేలా చూడాలని జిల్లా జేసీలను ఆదేశించింది. ల్యాబ్ లలో సేకరించిన నమూనాల ఫలితాలు వచ్చిన వెంటనే కోవిడ్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచనలు జారీ చేసింది.

కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించి నమూనాలను జాగ్రత్త చేయాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఐడీ నెంబరు, సరైన మూత లేకుండా లేకుండా నమూనాల సేకరణ, బాక్సింగ్ లాంటి విధానాలు పాటించకుండా నిర్ధరణ పరీక్షలు చేసేందుకు వీల్లేదని ఆదేశించింది. సదరు ఫలితాలను ఎంఎస్ఎస్ కోవిడ్ పోర్టల్​లో నమోదు చేయకుండా తిరస్కరించాలని సూచించింది. రెడ్ మార్కింగ్ చేసిన నమూనాలను ప్రాధాన్యతగా గుర్తించి తక్షణం ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఒకసారి కరోనా పాజిటివ్ సోకిన రోగికే మళ్లీ పాజిటివ్ వస్తే ఆ ఫలితాన్ని కొత్తదిగా ప్రకటించొద్దని ప్రభుత్వం సూచించింది. ఎంఎస్ఎస్ కోవిడ్ పోర్టల్, ఐసీఎంఆర్ పోర్టల్ లో నమోదు చేసే ఫలితాలు ఆరుగంటలకన్నా ఆలస్యం అయ్యేందుకు వీల్లేదని వీఆర్డీఎల్ ల్యాబ్స్ కు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ... కారణం ఇదే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.