రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రేట్ కాంట్రాక్టు విధానంలో బోర్లు వేసేందుకు అనుమతిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
గతంలో నియోజకవర్గానికి ఒక బోర్ వెల్ మిషన్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. బోర్ వెల్ యంత్రాల సరఫరా, పర్యవేక్షణకు టెండర్లు దాఖలు కాకపోవడంతో రేట్ కాంట్రాక్టు విధానంలో రైతులకు అవసరం అయిన చోట తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. బోర్ల తవ్వకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఇదీ చదవండి:
సీఎం నివాసం వద్ద కరోనా కలకలం.. 8 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్