ETV Bharat / city

ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ మార్గ దర్శకాలు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దళారుల వల్ల రైతులు మోసపోకుండా చర్యలు తీసుకున్న ప్రభుత్వం... గ్రామస్థాయిలోనే ధాన్యం కనీస మద్దతు ధర తెలిసేలా చర్యలు చేపట్టింది. జేసీలు, డీఎస్‌వోలకు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

GUIDELINES
GUIDELINES
author img

By

Published : Apr 25, 2020, 11:05 AM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా... ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దళారుల వల్ల మోసపోకుండా... గ్రామస్థాయిలోనే ధాన్యం కనీస మద్దతు ధర తెలిసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు జేసీలు, డీఎస్​వోలకు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ప్రకటించిన ధాన్యం మద్దతు ధరను పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. సాధారణ రకం క్వింటాలుకు 18 వందల 15 రూపాయలు, గ్రేడ్‌-A రకం 18 వందల 35 రూపాయలుగా మద్దతు ధరను నిర్ణయించారు.

గ్రామాల వారీగా నిత్యం వరికోతలు, విక్రయాలు పర్యవేక్షించాలని కోన శశిధర్‌ సిబ్బందిని ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని మిల్లులకు పంపేందుకు జీపీఎస్ వాహనాలను సిద్ధం చేసుకోవాలని... సదరు ధాన్యం నిర్ణీత మిల్లుకు చేరిందో లేదో నిర్ధరించుకోవాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు వస్తే... టోల్ ఫ్రీ నంబర్‌ 1902కు రైతులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించిన యంత్రాలు, ఇతర సామగ్రిని మార్కెటింగ్‌శాఖ సమకూర్చాలని కోన శశిధర్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: కశ్మీర్​లో ఎన్​కౌంటర్..​ ముగ్గురు ముష్కరులు హతం!

For All Latest Updates

TAGGED:

GUIDELINES
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.