ETV Bharat / state

జగన్‌ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!

కేవీ రావు ఫిర్యాదుతో జగన్‌ మరో దాష్టీకం వెలుగులోకి

CID Inquiry On Kakinada Port
CID Inquiry On Kakinada Port (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

Updated : 11 hours ago

CID Inquiry On Kakinada Port : వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ పోర్టు, సెజ్‌లోని రూ.3600 కోట్ల విలువైన వాటాను కారుచౌకగా కొట్టేయడానికి జగన్‌ అండ్‌ కో చేసిన దాష్టీకాలను బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌-కేఎస్​పీఎల్​లో కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌-కేఐహెచ్‌పీఎల్​కు 41.12 శాతం వాటాతో రూ.2,15,50,905 షేర్లు ఉండేవి.

కేఎస్​పీఎల్​ 2014-15లో రూ.491.47 కోట్లు, 2015-16లో రూ.421.32 కోట్లు, 2016-17లో రూ.417.69 కోట్లు, 2017-18లో రూ.439.57 కోట్లు, 2018-19లో రూ.576.53 కోట్లు, 2019-20లో రూ.628.71 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2019-20 నాటికి రూ.240 కోట్ల నగదు నిల్వలున్నాయి. కాకినాడ సెజ్‌కు పొన్నాడ, మూలపేట, రమణక్క పేటల్లో 8320 ఎకరాల భూములున్నాయి. అందులో కేఐహెచ్‌పీఎల్​కు, కేవీఆర్‌ గ్రూప్​నకు 48.74 శాతం వాటా ఉండగా మిగతా వాటా జీఎంఆర్​ది.

2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కేఎస్​పీఎల్ కార్యకలాపాల నిర్వహణలో పోర్టు డైరెక్టర్లు, ఏపీ మారిటైమ్‌ బోర్డు నుంచి సహకారం కొరవడింది. ప్రైవేట్‌ రంగంలోని ఈ కంపెనీ పూర్తిగా లాభాల్లో ఉండటం నామమాత్రపు అప్పులు కలిగి ఉండటమే ప్రధాన కారణం. 1999లో కేఎస్​పీఎల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య రాయితీ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం కేఎస్​పీఎల్​ స్థూల రాబడిలో 22 శాతం సర్కార్​కి చెల్లించాలి.

Kakinada Port Sale Issue : ఈ నేపథ్యంలో 2014-2019 మధ్య పోర్టులో జరిగిన అన్ని వ్యవహారాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడిట్‌ చేయించింది. కేఎస్​పీఎల్​ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.965.65 కోట్ల నష్టం కలిగించిందంటూ తప్పుడు వివరాలతో ఆడిట్‌ సంస్థ నివేదిక సమర్పించిందని, దాన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయాలని తనను బెదిరించారని బాధితుడు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2020 మే నెలలో ఫోన్‌ చేసి కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌ వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్‌రెడ్డిని కలిసి మాట్లాడాలని చెప్పారని కేవీ రావు తన ఫిర్యాదులో వివరించారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డికి సోదరుడు, అరబిందో యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డి కూడా ఉంటారని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత విక్రాంత్‌రెడ్డి కాల్‌ చేసి జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి రమ్మంటే వెళ్లానని చెప్పారు. స్పెషల్‌ ఆడిట్‌ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వానికి కేఎస్​పీఎల్ రూ.1000 కోట్ల మేర వాటా సొమ్ము చెల్లించాలని విక్రాంత్‌రెడ్డి చెప్పారని కేవీ రావు వెల్లడించారు.

ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు : తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆడిటర్లు రికార్డులను ఫ్యాబ్రికేట్‌ చేసి, అలా తప్పుడు నివేదిక ఇచ్చారని విక్రాంత్‌రెడ్డికి వివరించానని కేవీ రావు వివరించారు. ఆ సొమ్ము చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వం నోటీసులిస్తే కేఎస్​పీఎల్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందంటూ విక్రాంత్‌రెడ్డి తనను హెచ్చరించారని వెల్లడించారు. కేఎస్​పీఎల్​లో తనకున్న 50 శాతం వాటా, కాకినాడ సెజ్‌లోని 48.74 శాతం వాటాల్ని తాము చెప్పిన వారి పేరిట బదిలీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు.

అయితే కేఎస్​పీఎల్​లో కేఐహెచ్​పీఎల్​కు 41.12 శాతం వాటా, వ్యక్తిగతంగా తనకు 20 షేర్లు మాత్రమే ఉన్నాయని విక్రాంత్​రెడ్డికి చెప్పినట్లు కేవీ రావు పేర్కొన్నారు. అయితే తన కోసం వాటాలు బదలాయించాలని అడగడం లేదని, వాటిని సీఎం జగన్‌ కావాలనుకుంటున్నారని విక్రాంత్‌రెడ్డి తనతో చెప్పారని వివరించారు. అందుకు సమ్మతించకపోతే మీరు, మీ కుటుంబసభ్యులు క్రిమినల్‌ కేసులు, విజిలెన్స్‌ విచారణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారని కేవీ రావు వెల్లడించారు.

వాటాలు బదిలీ చేసినందుకు ఎంతో కొంత సొమ్ము చెల్లిస్తామన్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అంగీకరించాల్సిందేనని తనపై ఒత్తిడి చేశారని కేవీ రావు వివరించారు. విక్రాంత్‌రెడ్డితో భేటీ ముగిసిన తర్వాత జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెప్పారు. వాటాల బదిలీకి ఒప్పందాలను సిద్ధం చేస్తున్నామని అందుకు సహకరించాలని మూడు రోజుల తర్వాత విక్రాంత్‌రెడ్డి తనకు సమాచారమిచ్చారని కేవీ రావు తెలియజేశారు.

అరబిందోకు అమ్ముతున్నట్లు తెలిసింది : ఒప్పంద పత్రాలు సిద్ధమవుతున్న క్రమంలో కేఎస్​పీఎల్, కాకినాడ సెజ్‌లోని వాటాల్ని అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ప్రస్తుతం అరో ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అమ్ముతున్నట్లు తెలిసిందని కేవీ రావు అన్నారు. కేఎస్​పీఎల్​లోని వాటా విలువ నిర్ణయించేందుకు అరబిందో సంస్థ చెన్నైకు చెందిన మనోహర్‌ చౌదరి అండ్‌ అసోసియేట్‌ను నియమించిందని చెప్పారు. రూ.10ల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ విలువను రూ.229.42గా ఆ సంస్థ తేల్చిందన్నారు. మొత్తం 41.12 శాతం వాటాల విలువను రూ.494 కోట్లుగా లెక్కించిందని తెలిపారు. ఇది వాస్తవ విలువను ఏ మాత్రం ప్రతిబింబించట్లేదని నిరసన తెలిపానని కేవీ రావు వివరించారు.

కంపెనీ నికర ఆస్తుల విలువ, గత కొన్నేళ్లలో ఆర్జించిన లాభాలు, భవిష్యత్​ రాబడుల సామర్థ్యం ఆధారంగా వాటా విలువ నిర్ణయించాలని ఆదాయపు పన్ను నియమావళి ఒక్కటే ప్రాతిపదికగా షేర్‌ విలువ నిర్ణయించటం సరికాదని వాదించినట్లు కేవీ రావు చెప్పారు. కేఎస్​పీఎల్​లోని 41.12 శాతం వాటా విలువ రూ.2500 కోట్ల కంటే తక్కువ ఉండదని అతి నామమాత్రపు ధరకు వాటాలు లాగేసుకోవటం సహేతుకం కాదని విక్రాంత్‌రెడ్డికి వివరించానని కేవీ రావు వ్యాఖ్యానించారు.

CID Inquiry On Kakinada SEZ : అరబిందో సంస్థ పేరిట చట్టబద్ధంగా వాటాలు బదిలీ కావాలి కాబట్టే రూ.494 కోట్లు చెల్లిస్తున్నామని ఇస్తున్నదాంతో సరిపెట్టుకోవాలని విక్రాంత్‌రెడ్డి తనను బెదిరించారని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. తాను చెప్పినట్లు వినకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని పేర్కొన్నారు. తనతోపాటు కుటుంబసభ్యుల్ని అరెస్టు చేసి జైల్లో వేస్తామని, ఇతర వ్యాపారాలన్నీ నిలిపివేయిస్తామని భయపెట్టారని కేవీ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో తాను 2020 జూన్‌ 24న విక్రాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లగా అప్పటికే శరత్‌చంద్రారెడ్డి, మరికొందరు వ్యక్తులు, వరుణా లా సంస్థ న్యాయవాదులు అక్కడ ఉన్నారని కేవీ రావు తెలిపారు. కేఎస్​పీఎల్​లోని కేఐహెచ్​పీఎల్​ వాటాను ఎంత మొత్తానికి కొంటున్నారనే విషయం లేకుండానే ఒప్పంద పత్రాల్ని రూపొందించి వాటిపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. తనను తీవ్రంగా బెదిరించి అత్యంత మోసపూరితంగా, ఫ్యాబ్రికేటెడ్‌ డాక్యుమెంట్లతో వాటా కొనుగోలు ఒప్పందం చేయించుకున్నారని కేవీ వివరించారు.

ఒప్పందంపై సంతకాలు చేసిన కొద్ది రోజుల తర్వాత కేఐహెచ్​పీఎల్​ ఖాతాకు రూ.100 కోట్లు జమ చేశారని కేవీ రావు తెలిపారు. ఒప్పంద పత్రాలపై సంతకాలన్నీ పూర్తయిపోయాక విక్రాంత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి తనను విజయవాడ పిలిపించి అప్పటి సీఎం జగన్‌ దగ్గరకు తీసుకెళ్లారని కేవీ రావు చెప్పారు. అప్పటి వరకు జరిగిన వ్యవహారాలన్నీ విక్రాంత్​రెడ్డి ఆయనకు వివరించారని పేర్కొన్నారు వాటిపై నిరసన తెలిపేందుకు యత్నించగా జగన్‌మోహన్‌రెడ్డి తనను మాట్లాడనివ్వలేదన్నారు.

జగన్‌ కోసమే ఇదంతా అని తేలిపోయింది : విక్రాంత్‌రెడ్డి ఏది చెబితే అది చేయాలని ఆదేశించారని దీన్ని బట్టి ఇదంతా జగన్‌ కోసమే జరుగుతోందని తనకు అర్థమైందని కేవీ రావు తన ఫిర్యాదులో ప్రస్తావించారు. వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం మిగతా రూ.394 కోట్లను కేఐహెచ్​పీఎల్​కు 2021 ఫిబ్రవరి 9న చెల్లించారని చెప్పారు. దీంతో కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌లో కేఐహెచ్​పీఎల్​కు ఉన్న 41.12 శాతం షేర్‌ హోల్డింగ్‌ అరబిందోకు పూర్తిగా బదిలీ అయిపోయిందని తెలిపారు.

కేఎస్​పీల్​లో వాటాల్లో మార్పుచేర్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. విక్రాంత్‌రెడ్డి సూచన మేరకు షేర్‌ హోల్డింగ్‌లో మార్పులకు అనుమతి కోరుతూ కేఎస్‌పీఎల్‌ నాటి ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ 2020 డిసెంబర్ 24న అందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియను విక్రాంత్‌రెడ్డే దగ్గరుండి నడిపించారు. వాటాలన్నీ అరబిందో పరమయ్యాక అంతకుముందు ఆడిట్‌ నివేదికలో పేర్కొన్న రూ.965.65 కోట్ల నష్టాన్ని రూ.9.03 కోట్లకు కుదించుకున్నారని కేవీ రావు వివరించారు.

రూ.12 కోట్లకే లాక్కున్నారు : కాకినాడ సెజ్‌లోని 48.74 శాతం వాటాలనూ తమ నామినీల పేరిట బదిలీ చేయాలని విక్రాంత్‌రెడ్డి 2020 మే నెలలో బెదిరించారని కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.12 కోట్లకు వాటాలు అమ్ముతున్నట్లు ఒప్పందపత్రం రూపొందించి తమ చేత 2020 అక్టోబర్ 12న బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. ఈ వాటాల బదిలీ పూర్తయిన తర్వాత అరబిందో సంస్థ కాకినాడ సెజ్‌లో వాటాదారుగా మారిందని చెప్పారు. అదే సమయంలో కాకినాడ సెజ్‌లో జీఎంఆర్‌ గ్రూప్​నకు ఉన్న వాటాను కూడా అరబిందో కొనేసిందన్నారు. దీంతో మొత్తం 100 శాతం వాటాలు అరబిందో పరమయ్యాయని వివరించారు. కాకినాడ సెజ్‌కు అనుబంధ సంస్థ అయిన కాకినాడ గేట్‌వే పోర్ట్స్‌ లిమిటెడ్‌ కూడా వారి సొంతమైందన్నారు.

2020 మే నుంచి 2021 ఫిబ్రవరి మధ్య ఈ దందాలు జరిగాయన్న కేవీ రావు రాష్ట్రంలో అధికారం మారడంతో ఆస్తుల కబ్జాపై ఫిర్యాదు చేస్తున్నట్లు సీఐడీకి వివరించారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కేసు నమోదుచేసిన సీఐడీ విక్రాంత్‌రెడ్డి, విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి పి.శరత్‌చంద్రారెడ్డి, పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్ఎల్​పీ ఆడిట్‌ సంస్థలు, అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని డైరెక్టర్లు, ఇతరులను నిందితులుగా చేర్చింది.

వైఎస్సార్సీపీ 'సముద్రపు దొంగలు' - కాకినాడ పోర్టులో చినబాబురెడ్డి 'డి గ్యాంగ్‌' దందాలు

ప్రభుత్వ వ్యవస్థలు పతనం! - కాకినాడ పోర్టు కేంద్రంగా భారీగా తరలుతున్న సరుకు

Last Updated : 11 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.