CM Chandrababu Naidu to build His Own House in Velagapudi : సీఎం చంద్రబాబు వెలగపూడిలో సొంత ఇల్లు కట్టుకోనున్నారు. ప్రస్తుతం ఆయన కృష్ణా నది ఒడ్డున ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో గత పదేళ్లుగా ఉంటుండగా అక్కడి నుంచి రాజధాని ప్రాంతానికి మారబోతున్నారు. సువిశాల స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేశారు. భవిష్యత్తు కుటుంబ అవసరాలు, తన హోదా, వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థలం వైపు మొగ్గు చూపారు.
రోడ్డుకు ఆనుకుని ఉన్న 25 వేల చదరపు గజాల ప్లాట్ అనుకూలంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరున ఉన్న రిటర్నబుల్ ప్లాట్. ఇప్పటికే రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది. దీనికి నాలుగు వైపులా రోడ్డు ఉండడం ప్రధానంగా రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సెస్ దీని పక్క నుంచి వెళ్తుండడంతో ఈ స్థలాన్ని ఎంపిక చేశారు.
నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం
సమీపంలో జీవో, ఎన్జీవో నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, విట్ విశ్వవిద్యాలయం, తాత్కాలిక హైకోర్టు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పాటు రవాణా పరంగానూ అనుకూలతులు ఉన్నట్లు భావించి కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణం పునాది పటిష్టం తదితర అంశాలకు సంబంధించి నిపుణులు ఇప్పటికే పలుచోట్ల మట్టి పరీక్షలు జరిపారు. ఇంటి నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు సమాచారం.
Chandrababu Naidu New House in Velagapudi : దీనిని వాస్తు నిపుణులతో కూడా చూపించి అనుకూలంగా ఉండడంతో కొన్నట్లు సమాచారం. ఇంటి నిర్మాణం, పునాది పటిష్టం తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే పలుచోట్ల మట్టి పరీక్షలు కూడా జరిపారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్‌లో కొంత విస్తీర్ణంలోనే ఇంటిని నిర్మించదలిచినట్లు తెలుస్తుంది. మిగిలిన విస్తీర్ణంలో ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, తదితర అవసరాల కోసం వినియోగించనున్నారు. త్వరలో రాజధానిలోని ఎల్పీఎస్ (LPS) లేఅవుట్లలో పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ (CRDA) టెండర్లు పిలవబోతోంది.
కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణపై సీఐడీ విచారణ - మంత్రులతో సీఎం చంద్రబాబు