ETV Bharat / city

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీలు - పీపీఏ తాజా వార్తలు

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 21 కి వాయిదా వేసింది.

hc
author img

By

Published : Nov 7, 2019, 3:34 PM IST

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీలు

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై ప్రభుత్వం హైకోర్టులో మరోసారి అప్పీలు చేసింది. ఇప్పటికే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంధన శాఖ, విద్యుత్ పంపిణీ సంస్థలు 2 అప్పీళ్లు దాఖలు చేశాయి. పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ దుర్గా ప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ఈనెల 21 కి విచారణ వాయిదా వేసింది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోళ్లలో కోత పెట్టటం, విద్యుత్ తీసుకోకుండా నిరాకరించటం చేయొద్దని డిస్కంలను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు.

Intro:Body:

ap_vja_11_07_govt_appeals_in_hc_for_ppa_av_3052784_0611digital


Conclusion:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.