రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే - పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం వార్తలు
2020-21 ఏడాదికి రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించించింది. ప్రతి పంటకు కనీస గిట్టుబాటు ధరను ప్రకటించింది.
![రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే ap government announced supportive price to agricultural products](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9003212-617-9003212-1601516487844.jpg?imwidth=3840)
పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ప్రభుత్వం
2020-21 ఏడాదికి రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించించింది. మద్దతు ధరకు అమ్ముకోవాలంటే రైతన్నలు తప్పనిసరిగా ఈ-కర్షక్లో పంట వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఆర్బీకేలో గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకుల పంటలు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు కనీస గిట్టుబాటు ధర లభించకుంటే వెంటనే వారు కొనుగోలు చేస్తారు. రైతులు ఆర్బీకేకు తీసుకువచ్చే ధాన్యం కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలి.
పంట | మద్దతు ధర (క్వింటాకు) |
పసుపు | 6,850 |
మిర్చి | 7,000 |
ధాన్యం(ఏ-గ్రేడ్) | 1,888 |
ఉల్లి | 770 |
జొన్నలు(మాల్దండి) | 2,640 |
సజ్జలు | 2,150 |
రాగులు | 3,295 |
మొక్కజొన్నలు | 1,850 |
కొబ్బరిబాల్ | 10,300 |
కొబ్బరి మర | 9,960 |
కాటన్ (పొట్టి పింజి) | 5,515 |
కాటన్ (పొడవు పింజి) | 5,825 |
బత్తాయి/చీనీ కాయలు | 1,400 |
అరటి | 800 |
శనగలు | 5,100 |
సోయాబీన్ | 3,880 |
పొద్దుతిరుగుడు | 5,885 |
పెసలు | 7,196 |
మినుములు | 6,000 |
వేరుశనగ | 5,275 |
కందులు | 6,000 |
ఇవీ చదవండి..
Last Updated : Oct 1, 2020, 8:29 AM IST