ETV Bharat / city

పల్టీ కొట్టిన పైసల బండి..

author img

By

Published : Feb 4, 2020, 6:08 AM IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా మారుతోంది. గత అయిదేళ్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నింటా నేలచూపులే. 2015-16 నుంచి 2018-19 వరకూ ఆదాయాలు, ఖర్చుల్లో పురోగతి కనిపించగా... ఈసారి హఠాత్తుగా దిగజారింది. దీర్ఘకాల ప్రయోజనాలు అందించే పెట్టుబడి వ్యయంపై... 9 నెలల్లో కనీసం రూ.6వేల కోట్లు కూడా వెచ్చించలేకపోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది.

Ap economy in dire-state
పల్టీ కొట్టిన పైసల బండి..

పల్టీ కొట్టిన పైసల బండి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.... 2019 డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆర్థిక లెక్కలు దాదాపు ఖరారయ్యాయి. పన్నులు , కేంద్ర పన్నుల్లో వాటాలు, ఇతరత్రా సెస్‌లు లాంటి ఆదాయాలు కలిపి లెక్కించే రెవెన్యూ వసూళ్ల కింద.... 9 నెలల్లో సాధించింది కేవలం రూ.72 వేల 322 కోట్లు. డిసెంబర్‌ నెలాఖరుకు లక్షా 78 వేల కోట్ల ఆదాయం సాధిస్తామని ఆర్థిక శాఖ అంచనా వేస్తే... అందులో సగం కూడా రాలేదు. రుణాల రికవరీ, అప్పులు లాంటివి కూడా కలిపితే మొత్తం ఆదాయం లక్షా 12 వేల కోట్ల వరకూ ఉంది. అది కూడా అంచనాల్లో 52 శాతం మాత్రమే కావడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన 3 నెలల్లో ఇక సాధించేది ఏమిటి? గట్టెక్కేదెలా అన్నది చర్చనాయంశంగా మారింది.

ap-economy-in-dire-state
రెవెన్యూ ఆదాయం (రూ.కోట్లలో)

సంక్షేమానికే అధిక ప్రాధాన్యం

జీతాలు, పింఛన్లు, అసలు, వడ్డీ చెల్లింపులు వంటి ప్రధాన ఖర్చులన్నీ పోను.... ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీర్ఘకాల ప్రయోజనాలు కల్పించే మూలధన వ్యయానికి ఎంత కేటాయించగలుగుతున్నామనేది కూడా ప్రధానాంశమే. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సంక్షేమంపై చేసే ఖర్చు కూడా మూలధన వ్యయం లాంటిదే అన్న కొత్త వాదనను ఇటీవల తెరపైకి తీసుకువస్తున్నారు. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద రూ. 32 వేల 293 కోట్లు ఖర్చు చేయాలి. కానీ 9నెలల్లో కేవలం 5వేల 805 కోట్లు అంటే 20శాతం లోపే ఖర్చు చేయగలిగారు.

ap-economy-in-dire-state
అయిదేళ్లలో డిసెంబరు నాటికి మొత్తం వసూళ్లు
ap-economy-in-dire-state
గత అయిదేళ్లలో డిసెంబరు నెలాఖరు నాటికి మూలధన వ్యయం

ఇదీ చదవండి : రోహత్గీకి ఐదు కోట్ల ఫీజుపై వివరణ కోరిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.