ETV Bharat / city

ఏ మాత్రం జారినా కారు కింద పడిపోయేవాడిని: ఎస్సై గోపినాథ్​రెడ్డి - kadapa sp anburajan

అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంలో కడప జిల్లా పులివెందుల ఎస్సై గోపీనాథ్‌రెడ్డి చూపిన తెగువకు ప్రశంసలు లభిస్తున్నాయి. డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఈ విషయం తెలుసుకొని ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. వాహనాన్ని ఆపడం తప్ప మరే మార్గం లేకుండా పోయిందని అందుకే ఈ సాహసం చేశానంటున్న ఎస్సై గోపీనాథ్‌ రెడ్డితో ‘ఈటీవీ భారత్​ ముఖాముఖి నిర్వహించింది.

ap-dgp
ap-dgp
author img

By

Published : Aug 29, 2020, 5:10 PM IST

Updated : Aug 29, 2020, 10:56 PM IST

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా పోలీసు ఆఫీసర్‌నే వాహనంతో ఢీకొట్టి ముందుకు వెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకోవడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గోపీనాథ్‌రెడ్డి ఈటీవీ ప్రతినిధికి పలు విషయాలు వెల్లడించారు.

పులివెందుల ఎస్​ఐ గోపినాథ్​రెడ్డితో ముఖాముఖి

గర్వంగా ఉంది: ఎస్​ఐ గోపినాథ్ రెడ్డి

  • పులివెందులలో ఏం జరిగింది? మద్యం మాఫియాను ఏవిధంగా పట్టుకున్నారు?

గోపీనాథ్‌రెడ్డి: ఒక వాహనంలో మద్యం అక్రమరవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో పార్నపల్లి రోడ్డులో రాఘవేంద్ర హాల్‌ సమీపంలో వాహనాల తనిఖీ ప్రారంభించాం. ఆ సమయంలో ఒక వాహనం సమీపంలోకి వచ్చి వేగం తగ్గించింది. మా దగ్గరికి రాగానే ఒక్కసారిగా వేగం పెంచారు. ఈ పరిణామంతో వాహనాన్ని ఆపేందుకు అడ్డుగా వెళ్లిన నేను బానెట్‌ మీద పడ్డాను. నిందితుడు వేగం పెంచడంతో అక్కడి నుంచి వాహనంపైకి ఎక్కి గట్టిగా పట్టుకొని ఒకటిన్నర కిలోమీటరు అలాగే వెళ్లాను. ఈ క్రమంలో వాహనం అద్దాలు పగిలాయి. దాన్ని మరింత పగులగొట్టి కారు లోపలికి వెళ్లాను. నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. వాళ్లను ఎస్పీ ఆదేశాల మేరకు త్వరలోనే పట్టుకుంటాం. కారులో మొత్తం ఇద్దరు నిందితులున్నారు.

  • కారు బానెట్ మీద పడేందుకు మీకు ధైర్యం ఎలా వచ్చింది? ఆ సమయంలో నిందితుల ప్రవర్తన ఎలా ఉంది?

గోపీనాథ్‌రెడ్డి: కారు బానెట్‌ మీద పడినప్పుడు మనం గాయాల పాలు కాకుండా ఉండాలంటే అదొక్కటే మార్గం. కిందికి దిగినా, ఏం చేసినా.. కారు కింద పడటమో, డివైడర్‌కు తల కొట్టుకోవడమో జరుగుతుంది. అక్కడున్న ఒకే ఒక మార్గం వాహనాన్ని ఆపడం. వాళ్లు ఎలాగూ ఆపరు కాబట్టి నేనే వాహనంలోకి దిగాలి. అందువల్ల పగిలిన అద్దాన్ని మరింత పగులగొట్టి లోపలికి వెళ్లాను.

  • మీ దగ్గర ఆ సమయంలో ఆయుధం ఉందా? లేదా? మీరు సివిల్‌ డ్రెస్‌లో ఉన్నట్లు సీసీ కెమెరాలో కనిపిస్తోంది.
    గోపీనాథ్‌రెడ్డి: నాతో పాటు సిబ్బంది అంతా ఉన్నారు. వాళ్లు కూడా నిందితుల్ని ఆపడానికి ప్రయత్నించారు. పక్కన వాళ్లంతా యూనిఫామ్‌లోనే ఉన్నారు. పక్కనున్న సిబ్బంది కూడా అప్పటికే ఆ అద్దాలు లాగడానికి ప్రయత్నించారు. కానీ అంత సమయం దొరకలేదు. ఒక కానిస్టేబుల్‌ ముందుగానే వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించి అద్దం మీద గట్టిగా కొట్టారు. ఆ సమయంలో కూడా అద్దం కొంత పగిలి ఉండవచ్చు. ఏ సమయంలో అద్దం పగిలిందని చెప్పడం కష్టం. సిబ్బంది కూడా జీపులో వాహనాన్ని ఛేజ్‌ చేసుకుంటూ వచ్చారు. నిందితులపై ఇతర కేసులేమైనా ఉండొచ్చు. వాటి నుంచి తప్పించుకునేందుకు ఇలా పారిపోవడం చేసి ఉండవచ్చు.
  • పులివెందుల పట్టణంలో ఓ సెన్సిటివ్‌ ప్రాంతంలో మీరు ఎందుకు అంత సాహసం చేయాల్సి వచ్చింది?

గోపీనాథ్‌రెడ్డి: సాహసం అనేది ఏం లేదు. విధుల్లో భాగంగా ప్రయత్నించాం. అనుకోని విధంగా నిందితుడు వాహనంతో ఢీకొట్టాడు. దీంతో వాహనం మీద పడ్డా. ఇటువంటి పరిస్థితుల్లో అద్దం పగులగొట్టి వాహనంలోకి వెళ్లాల్సి వచ్చింది.

  • నిందితుడు ఏటీఎంల దొంగతనం చేస్తున్నట్లు గత చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది?

గోపినాథ్‌రెడ్డి: ఏటీఎం దొంగతనాలు చేసినట్లు గత చరిత్ర ఉంది. పులివెందుల పోలీసు స్టేషన్‌లో కూడా అతనిపై రెండు కేసులున్నాయి. అతడు పరారీలో ఉన్నాడు. అతడి స్వగ్రామంలో ఉన్న దాఖలాలు లేవు. మద్యం రవాణా ఇటీవలే మొదలు పెట్టినట్లున్నాడు. ప్రారంభంలోనే మేము పట్టుకున్నట్లు భావిస్తున్నాం.

  • రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో మొదటిసారి మీరు చేసిన సాహసానికి డీజీపీ కూడా ప్రశంసించారు. మీకు ఎలా అనిపించింది?

గోపీనాథ్‌రెడ్డి: ఇది మొదటి సారి కాదు. గతంలో చాలా మంది పోలీసులు ఇటువంటి సాహసాలు చేశారు. ఎర్రచందనం వాహనాల్ని పట్టుకోవడం లాంటివి చేశారు. డీజీపీ నన్ను అభినందించడం గర్వంగా ఉంది.

రివార్డు అందజేసిన ఎస్పీ

కడప ఎస్పీ కార్యాలయంలో ఎస్ఐ గోపినాథ్ రెడ్డిని ఎస్పీ అన్బురాజన్ అభినందించి రివార్డు అందజేశారు. డీజీపీ నుంచి ఇచ్చే కమాండేషన్ పురస్కారానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి కడప జిల్లా పులివెందులకు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారం రావడంతోనే కారు నిలబెట్టేందుకు ఎస్ఐ ప్రయత్నించినా.. కారులో ఉన్నవాళ్లు ఆపలేదని ఎస్పీ తెలిపారు. అడ్డొచ్చిన ఎస్ఐని ఢీకొట్టి వెళ్తుండగా... కారు బ్యానెట్​పై పడిన ఎస్​ఐ రెండు కిలోమీటర్లు అలాగే ప్రయాణించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇంతటి తెగువ కనబరిచిన ఎస్ఐని పోలీసుశాఖ తరపున అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి

కారుతో ఎస్సైని ఢీకొట్టి... కొంత దూరం తీసుకెళ్లి..

Last Updated : Aug 29, 2020, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.