ETV Bharat / city

'దురుద్దేశంతోనే పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ చట్టాలు' - ఏపీ హైకోర్టు వార్తలు

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ప్రభుత్వం దురుద్దేశంతో తీసుకొచ్చిందని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. సాధారణ ఎన్నికలకు ముందు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొనకుండా విజయం సాధించాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. రహస్య అజెండాతో వ్యవహరించారని కోర్టుకు నివేదించారు. వివిధ కమిటీలు నివేదికలు సమర్పించక ముందే మూడు రాజధానుల ఏర్పాటు గురించి సీఎం శాసనసభలో వెల్లడించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Ap capital bills
Ap capital bills
author img

By

Published : Dec 2, 2020, 6:00 AM IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ గుంటూరు జిల్లాకు చెందిన ఎ.శ్రీనివాసరావు, మరో ముగ్గురు, అమరావతి పరిరక్షణ సమితి వేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి రాజధానిగా ఉండాలని పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ హైకోర్టులో అఫిడవిట్లు వేశాయన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అమరావతిలో అభివృద్ధి పనులన్నింటిని ఒక్కసారిగా నిలిపేశారన్నారు. రాజధానిని తరలించాలన్న సీఎం ఆకాంక్ష మేరకు జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌, ఉన్నతస్థాయి మంత్రుల కమిటీలు నివేదికలు ఇచ్చాయని వాదించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోలేదని ఈ మొత్తం వ్యవహారం వెనుక దురుద్దేశంతో పాటు ముఖ్యమంత్రి రహస్య అజెండా ఉందని ఆరోపించారు. రహస్య అజెండా ఉందని ఏవిధంగా చెబుతారని ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దురుద్దేశం ఏమిటో పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొనకుండా మౌఖికంగా వాదనల్లో చెప్పడం సరికాదంది. మీరు చెబుతోంది ముఖ్యమంత్రి ప్రవర్తన గురించి మాత్రమేనని దాన్ని దురుద్దేశంగా ఏవిధంగా పేర్కొంటారని ప్రశ్నించింది. రాజధాని కోసం రైతుల నుంచి వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించి చట్టబద్ధంగా ఒప్పందం చేసుకుందన్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిందన్నారు.

మూడు రాజధానులతో గందరగోళం

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపైనా కోర్టులో వాదనలు సాగాయి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్రానికి మధ్యలో రాజధానిని ఏర్పాటు చేశారన్న పిటిషనర్‌ కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్నాకే అప్పటి ప్రభుత్వం అమరావతిని నిర్ణయించిందన్నారు. ఈ వ్యవహారంపై ఓ సారి నిర్ణయం తీసుకున్నాక మార్చడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టిస్తోందని ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని వాదించారు. వివిధ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పాలన వికేంద్రీకరణ చట్టం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోందని...అభివృద్ధి చేయాలంటే రాజధానుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మూడు రాజధానులను అనుమతించడానికి వీల్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం రాజధాని వ్యవహారంతో మాకు సంబంధం లేదని ఏవిధంగా చెబుతుందని ప్రశ్నించారు.

విశ్వాస ఘాతుకమే!

పిటిషనర్‌ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ వివిధ రాష్ట్రాల్లో శాసన, కార్యనిర్వహణ వ్యవస్థలు ఒక నగరంలో హైకోర్టు మరో నగరంలో ఉన్నాయని గుర్తుచేసింది. చారిత్రక కారణాలు అనుమతిస్తే హైకోర్టు ఏర్పాటు చేయడంలో తప్పులేదని న్యాయవాది బదులిచ్చారు. అమరావతి విషయంలో మూడు వ్యవస్థలు ఒకచోటే ఉండాలని నిర్ణయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల విషయంలో చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి ప్రభుత్వం భూముల తీసుకొని ఇప్పుడు రాజధానిని తరలిస్తామని చెప్పడం విశ్వాస ఘాతుకానికి పాల్పడటమేనన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందన్నారు. మూడు రాజధానులకు అనుమతిస్తే రేపు ఇంకొకరు అధికారంలోకి వచ్చి రాజధానిని మరోచోట ఏర్పాటు చేస్తానంటారని వాదించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల్ని రద్దు చేయాలని కోరారు. అనంతరం విచారణ బుధవారానికి వాయిదా పడింది.

ఇదీ చదవండి : ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు కష్టం... హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.