ETV Bharat / city

12న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.... అమరావతిపై చర్చ! - ఏపీ కేబినేట్ సమావేశం

వికేంద్రీకరణకు సంబంధించి ఈ నెల 12న వైకాపా సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అమరావతి అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం.

cm jagan
cm jagan
author img

By

Published : Feb 7, 2020, 11:56 PM IST

ఈ నెల 12వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్​లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కీలకమైన అంశాలతో పాటు దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థికసాయం అందించే అంశంపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి కొన్ని నిర్ణయాలను ఈ భేటీలో తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే అమరావతి ప్రాంతంలో కోర్​ క్యాపిటల్​కి సంబంధించిన అంశాలు, రాజధాని ప్రాంత రైతులకు ప్రయోజనాలు కల్పించే మరికొన్ని అంశాలపైనా కేబినేట్​లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

13న కాదు.. 12న

ముందుగా 13వతేదీ కేబినేట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఉత్తర్వులు జారీచేశారు. అయితే గంట వ్యవధిలోనే ఈ ఉత్తర్వులను సవరిస్తూ కేబినేట్ సమావేశాన్ని ముందుకు జరిపారు. 12వతేదీనే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మంత్రులకు, కార్యదర్శులకు సమాచారం పంపించారు.

ఇదీ చదవండి

అమరావతి కోసం దర్గా వద్ద పొంగళ్లు పెట్టిన ముస్లిం మహిళలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.