ETV Bharat / city

VAT On Petrol: నేడు రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసనలు - ap bjp

పెట్రో ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్​ తగ్గించాలని రాష్ట్ర భాజపా డిమాండ్ చేసింది(vat on petrol in andhrapradesh news). ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నేడు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చింది(ap bjp has called for statewide protests).

VAT On Petrol
VAT On Petrol
author img

By

Published : Nov 5, 2021, 7:56 PM IST

Updated : Nov 6, 2021, 3:08 AM IST

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు భాజపా పిలుపునిచ్చింది. పెట్రో ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోవటాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు(ap bjp has called for statewide protests news). ఉదయం 11 నుంచి గంటపాటు నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం వ్యాట్ తగ్గించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సోము వీర్రాజు(Somu Veerraju)హెచ్చరించారు.

దేశంలో చమురు ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. అదే సమయంలో రాష్ట్రాలు సైతం వ్యాట్‌ తగ్గించుకోవాలన్న కేంద్రం సూచన మేరకు కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. ముఖ్యంగా భాజపా నేరుగా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీయే కూటమి పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. దీంతో వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలపై భాజపా ఒత్తిడి తెస్తోంది. పెట్రో ధరలపై మాట్లాడిన విపక్షాలు వ్యాట్‌ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర భాజపా నేతలు.. ప్రభుత్వం పోరాటానికి సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి: భాజపా పాలిత రాష్ట్రాల్లో దిగొచ్చిన పెట్రో ధరలు- మరి మిగతా చోట్ల?

Last Updated : Nov 6, 2021, 3:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.