జూరాల ప్రాజెక్ట్ గేట్ల దగ్గర మరో మహిళ మృతదేహం లభ్యమైంది. పాప కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ఈనెల 17న నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల నుంచి కురువపురం వెళ్తున్న పుట్టి కృష్ణా నదిలో పంచదేవుపాడు వద్ద మునిగింది. ఆ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు.
ప్రమాదంలో వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు బ్యాక్వాటర్లో ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. బుధవారం రెండు మృతదేహాలు దొరికాయి. ఇంకో చిన్న పాప కోసం వేతుకుతున్నారు. అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఇదీ చూడండి : తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి