పచ్చి పాలను తాగరాదని, కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని పశుసంవర్థక శాఖ సూచించింది. పశువులకు సోకే బ్రుసెల్లోసిస్ వ్యాధి.. పచ్చి పాలను తాగడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని వెల్లడించింది. పాడి రైతులు, పశువుల వద్ద పనిచేసేవారికి ఈ వ్యాధి సోకడానికి అవకాశాలున్నాయని, వాటి దగ్గరకు తప్పనిసరిగా మాస్కులు కట్టుకొని, బూట్లు వేసుకుని వెళ్లాలని తెలిపింది.
శరీరంపై గాయాలుంటే పశువుల దగ్గరకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. మరోపక్క 4 నుంచి 8 నెలల వయసున్న అన్ని రకాల ఆడ దూడలకు ఈ నెల 28 నుంచి 6 రోజుల పాటు బ్రుసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు లక్ష్మారెడ్డి చెప్పారు. మండల పశువైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ప్రతి గ్రామానికి వెళ్లి ఈ టీకాలు అందిస్తాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: