ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ లేటెస్ట్ న్యూస్

.

Andhra Pradesh Top news
Andhra Pradesh Top news
author img

By

Published : Oct 17, 2020, 5:01 PM IST

  • సామూహిక అత్యాచారం- నలుగురు అక్కాచెల్లెళ్ల హత్య!
    మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు మైనర్ బాలికలను గొడ్డలితో అతికిరాకంగా నరికి చంపారు దుండగులు. అక్కాచెల్లెళ్లయిన ఈ నలుగురిలో ఒకరిని సామూహిక అత్యాచారం చేసి.. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'
    సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంపై దేశవ్యాప్తంగా న్యాయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
    తితిదే నిధులతో బాండ్ల కొనుగోలుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తితిదే నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్ల కొనుగోలును వ్యతిరేకిస్తూ పిల్‌ దాఖలు చేసినట్లు భాజపా నేత భాను ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దారికి అడ్డొచ్చాడని ఆంబోతు ఆగ్రహం.. ఏం చేసిందంటే..!
    తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని సుబ్బాలమ్మ అమ్మవారి దేవస్థానం సమీపంలో అనూహ్య ఘటన జరిగింది. ఒక వ్యక్తి.. తన దగ్గరున్న బుట్టలో పండ్లు తీసుకొస్తున్నాడు. ఆయన వెనకాలే ఓ ఆంబోతు కూడా వస్తోంది. ఎవరో తెలిసిన వారు కనిపిస్తే వారితో ఆయన మాట్లాడుతూ నిలబడ్డాడు. వెనకాలే వస్తున్న ఆంబోతు... పండ్లు ఇవ్వండి అన్నట్టు సైగ చేసింది. ఇవేమీ ఆయన పట్టించుకోలేదు. అంతే.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కరోనా ఎఫెక్ట్: జనరిక్ మందుల వైపు ప్రజల చూపు
    కరోనా మహమ్మారి ఎంతోమంది ఆదాయ మార్గాలపై దెబ్బకొట్టింది. కొవిడ్ సమయంలో దాదాపు ప్రతి ఇంట్లో మందుల వినియోగం పెరిగింది. రక్షణ చర్యల్లో భాగంగా విటమిన్ టాబ్లెట్స్, యాంటీ బయాటిక్స్ వాడడం అధికమైంది. దీంతో ఆయా మందుల ధర పెరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'బల్విందర్ సింగ్ అంత్యక్రియలకు కుటుంబం అంగీకారం'
    శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్విందర్ సింగ్​ అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. తొలుత బల్విందర్ హత్యకు పాల్పడ్డ నిందితులను అరెస్టు చేస్తేనే.. ఆయన పార్థీవ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'స్నేహితుల జేబులు నింపటంలోనే మోదీ ప్రభుత్వం బిజీ'
    ప్రపంచ క్షుద్బాధ సూచీలో భారత్​ 94వ స్థానంతో సరిపెట్టుకున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. స్నేహితుల జేబులు నింపటంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని.. అందుకే దేశంలో ఆకలి కేకలు పెరిగాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • బైడెన్​ గెలిస్తే అమెరికాను వదిలి వెళ్తానేమో: ట్రంప్​
    అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, ప్రత్యర్థి బైడెన్​ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్​. తాను ఒకవేళ ఓడిపోతే.. అమెరికాను వదిలి వెళ్లొచ్చని మరోసారి వ్యాఖ్యానించారు. దీనిపై, జో బైడెన్​ వినూత్నంగా స్పందించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • నిలకడగా రాజస్థాన్ బ్యాటింగ్
    చాహల్ వేసిన ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడ్డాయి. ధాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో రాజస్థాన్ ఓపెనర్ ఉతప్ప 41 పరుగులు చేసి ఔటయ్యాడు. అనతంరం శాంసన్ (9) క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ బ్యాటింగ్ కాస్త నెమ్మదించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • నటి కంగనా రనౌత్​పై మరో కేసు
    ఇటీవలే వ్యవసాయ బిల్లు విషయంలో నటి కంగనా రనౌత్​పై కేసు నమోదైంది. తాజాగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఈమెతో పాటు సోదరి రంగోలీపైనా ముంబయి పోలీసులు కేసు పెట్టారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.