ETV Bharat / city

పరిషత్ ఎన్నికలపై.. కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ - ఏపీలో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై తాజా వార్తలు

ap mptc, zptc elections
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్
author img

By

Published : Apr 1, 2021, 4:22 PM IST

Updated : Apr 1, 2021, 4:55 PM IST

16:19 April 01

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. పరిషత్ ఎన్నికలు కొనసాగిస్తూ ఇచ్చే ప్రకటన విడుదలపై ఎస్‌ఈసీ కసరత్తు చేస్తున్నారు. సమావేశం అనంతరం ఎస్‌ఈసీ నీలం సాహ్ని.. ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

పరిషత్‌ ఎన్నికలకు గత ఏడాది మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొవిడ్‌ ఉగ్రరూపం దాల్చింది. ఆ పరిస్థితుల్లో.. మార్చి 15న నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్..‌ పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను తిరిగి కొనసాగించాలని నీలం సాహ్ని నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ సాయంత్రం ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

Last Updated : Apr 1, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.