ETV Bharat / city

రాష్ట్రానికి తీవ్ర నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌

ప్రత్యేక హోదా ఊసే లేదు.. రైల్వే జోన్‌ మాటే ఎత్తలేదు...కొత్తగా ఒక్క వరమూ ఇవ్వలేదు. కనీసం విభజన హామీల ప్రస్తావనే లేదు. మోదీ సర్కారు రాష్ట్రానికి మరోసారి మొండిచెయ్యి చూపింది. ఆర్థిక పరిపుష్టి కలిగిన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై అపార ప్రేమ కనబరిచిన కేంద్రం...విభజన గాయాలు, ఆర్థిక లోటు, ప్రకృతి విపత్తులతో కునారిల్లుతున్న ఏపీపై మాత్రం మరోసారి నిర్లక్ష్యాన్ని కనబరిచింది. భారీ వరాలకు నోచుకోకపోయినా..కనీస విదిలింపులూ లేవు. కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్న ఏపీకి మళ్లీ తీవ్ర నిరాశే ఎదురైంది.

కేంద్ర బడ్జెట్ 2021
ఏపీకి తీవ్ర నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌
author img

By

Published : Feb 2, 2021, 4:27 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన మొత్తం బడ్జెట్‌ ప్రసంగంలో...రాష్ట్రం నుంచి 3 పేర్లు మాత్రమే వినిపించాయి. అవి చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం. అలాగని ఈ 3 ప్రాంతాలకు ఏదో భారీ పరిశ్రమలు, పెద్ద ప్రాజెక్టులు ప్రకటించారనుకుంటే పొరపాటే..! విశాఖలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, ఖరగ్‌పూర్‌-విజయవాడ, ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా రైల్వే కారిడార్లు, చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ జాతీయ రహదారి ప్రాజెక్టు వల్ల ప్రత్యేకంగా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. ఉత్తర, దక్షిణ భారతాల అనుసంధానంలో భాగంగానే ఆ రైల్వే రవాణా కారిడార్లను కేంద్రం ప్రకటించింది. ఉద్దేశం ఏదైనా..రాష్ట్రంలోని ఓడరేవులకు, సరకు రవాణాకి అవి కొంత ఆలంబనగా నిలిచే అవకాశం ఉంది. ఇవి తప్ప బడ్జెట్‌లో మరెక్కడా ఏపీ గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు.

మెట్రో ప్రాజెక్టులను విస్మరించారు...

దక్షిణ భారతదేశంలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన బెంగళూరు, చెన్నై, కోచితో పాటు, మహారాష్ట్రలోని నాగపూర్, నాసిక్‌లలోని మెట్రోరైలు ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్రంలోని మెట్రోరైలు ప్రాజెక్టుల్ని మాత్రం విస్మరించారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు... మనకెందుకు అనుకున్నారో ఏమో...! అలాగని కనీసం విశాఖ మెట్రో ప్రాజెక్టు గురించీ మాట్లాడలేదు. కొత్తగా ద్వితీయశ్రేణి నగరాలకు మెట్రోలైట్, మెట్రోనియో ప్రాజెక్టులు వస్తాయని చెప్పారు. వాటిలో మన నగరాలకు చోటుందా అన్న స్పష్టత లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కోసం పోరాడుతున్నవారికి మళ్లీ నిరాశే మిగిలినట్టు కనిపిస్తోంది. త్వరలో రైల్వేబోర్డు విడుదల చేసే ‘పింక్‌ బుక్‌’లోనైనా రైల్వే జోన్‌ ప్రస్తావన ఉంటుందేమోనన్న ఆశే మిగిలింది.

ఏటా బడ్జెట్‌లు వస్తున్నాయి... పోతున్నాయి..! కనీసం కొత్త వరాల్లేకున్నా... విభజన హామీలూ నెరవేరని పరిస్థితి. ఆర్థిక కష్టాలు, తుపానులతో నష్టపోతున్న రాష్ట్రానికి ఎలాంటి చేయూత లేదు. ఈసారైనా ప్రత్యేక హోదా ఇస్తే... ఆర్థికంగా చేయూత లభిస్తుందని, పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయన్న ఆశలు నెరవేరలేదు. పోలవరం ప్రాజెక్టుకి నాబార్డుతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిధులు కేటాయించి ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేయాలన్న విజ్ఞప్తుల్నీ కేంద్రం పట్టించుకోలేదు. విభజన జరిగి ఏడున్నరేళ్లవుతున్నా... 2014-15 నాటికి ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు భర్తీ ఇప్పటికీ జరగలేదు. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి మంజూరు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురంలోని జేఎన్‌టీయూలో ఒక భవనంలో నడుస్తోంది. గత బడ్జెట్‌లో ఈ వర్శిటీకి 60 కోట్ల 35 లక్షల రూపాయలు కేటాయించిన కేంద్రం... సవరించిన అంచనాల్లో మాత్రం 4 కోట్ల 80లక్షల రూపాయలే చూపించింది.

ఏపీ, తెలంగాణ గిరిజన యూనివర్సిటీలకు గత బడ్జెట్‌లో 53 కోట్ల 80 లక్షల రూపాయలు కేటాయించిన కేంద్రం, సవరించిన అంచనాల్లో 4 కోట్ల రూపాయలకే పరిమితం చేసింది. ఈ బడ్జెట్‌లో మాత్రం మళ్లీ గత ప్రతిపాదనలే చేసింది.వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపు గురించీ ఈ బడ్జెట్‌లో స్పష్టత లేదు. నత్తనడకన సాగుతోన్న విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాల్లో పనులు వేగం పుంజుకునే దిశగా ఎలాంటి చర్యల్నీ, నిధుల్నీ ప్రకటించలేదు. రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పెంచే దిశగా ఎలాంటి చర్యలూ లేవు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధికల్పన దిశగా ఎలాంటి ఊతం ఇవ్వలేదు. బల్క్‌డ్రగ్‌ పార్క్, ఇతర పరిశ్రమల ప్రస్తావన చేయలేదు. ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థను, విద్యా సంస్థను రాష్ట్రానికి కొత్తగా ప్రకటించలేదు. విభజన హామీల్లో భాగంగా.. రాష్ట్రానికి ఇది వరకే మంజూరు చేసిన వివిధ కేంద్ర ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన వనరుల గురించి కూడా బడ్జెట్‌లో ప్రత్యేక ప్రస్తావనేదీ లేదు.

ఉపాధి హామీ పథకం నిధుల్ని గత కొన్నేళ్లుగా గరిష్ఠంగా వినియోగించుకుంటూ మొదటి మొదటి 5 రాష్ట్రాల్లో ఏపీ ఉంటోంది. కానీ 2020-21 సవరించిన బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే... ఈ బడ్జెట్‌లో కేంద్రం నరేగాకి నిధులు తగ్గించండం రాష్ట్రానికి కొంత అశనిపాతమయ్యే అవకాశముంది.

ఇదీ చదవండి

సకాలంలో నిధులు వచ్చేలా చూడాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.