ETV Bharat / city

ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ మింగాడు.. నల్లగా మారిపోతున్నాడు..! - ట్రెండింగ్ న్యూస్

ఒక సమస్యతో ఆసుపత్రికి వెళ్లామని అనుకుందాం.. డాక్టర్ పరిశీలించి మందులు ఇచ్చారు.. ఆ మెడిసిన్​తో ఉన్న జబ్బు నయంకాకపోగా.. కొత్త రోగం పుట్టుకొస్తే.. ఎలా ఉంటుందీ..?! అచ్చం ఇదే ఇబ్బందితో బాధపడుతున్నాడో వ్యక్తి. మెంటల్ టెన్షన్ తగ్గించవయ్యా సామీ అని ఓ వైద్యుడి దగ్గరికెళ్తే.. కొత్త టెన్షన్ తెచ్చి పెట్టాడు. ఎలాంటి మందులు ఇచ్చాడో గానీ.. అవి మింగిన దగ్గర్నుంచి పేషెంట్ నల్లగా మారుతున్నాడు! మారిపోతూనే ఉన్నాడు!!

effect
effect
author img

By

Published : Sep 29, 2022, 4:44 PM IST

కడుపులో గడ్డలున్నా ఫర్వాలేదుగానీ.. ముఖం మీద మాత్రం చిన్న మొటిమ కూడా ఉండొద్దని ఆరాటపడే కాలమిది. ఇవాళా..రేపు మనుషులు అందం కోసం పడి చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. తెల్లగా ఉన్న మనిషి నల్లగా మారిపోతే ఎలా ఉంటుంది? ఓ డాక్టర్ ఇచ్చిన మందులు ఇందుకు కారణమైతే.. బాధితుడి వేదన ఎలా ఉంటుంది? అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన ఓ బాధితుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...?

ఈ స్టోరీలోని బాధితుడి పేరు టైలర్ మాంక్. వయసు 34 ఏళ్లు. పెస్ట్-కంట్రోల్ ఫీల్డ్ ఇన్‌స్పెక్టర్​గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా డిప్రెషన్​తో బాధపడుతున్నాడు. దీంతో.. ట్రీట్​మెంట్ చేయించుకునేందుకు ఓ సైకాలజిస్ట్​ను సంప్రదించాడు. పరిశీలించిన మానసిక వైద్యుడు.. కొన్ని మందులు సూచించాడు. రోజూ వాటిని మింగడం మొదలు పెట్టాడు టైలర్. ఒక వారం తర్వాత.. ఊహించని మార్పు కనిపించడం మొదలైంది. మానసిక రోగం తగ్గడం సంగతి అటుంచితే.. ఒంట్లో కొత్త రోగం పుట్టుకొస్తున్న విషయాన్ని గమనించాడు. తెల్లగా ఉండే అతను.. కొద్ది కొద్దిగా నల్లగా మారిపోతున్నాడు.

తీవ్ర ఆందోళనకు గురైన టైలర్.. చర్మ సంబంధింత వైద్యుని వద్దకు పరుగు తీశాడు. కానీ.. కారణమేంటో కనుక్కోలేకపోయాడు ఆ డాక్టర్. దీంతో.. మరో హాస్పిటల్​కు వెళ్లాడు. అక్కడా ఇదే రిజల్ట్​ వచ్చింది. ఇలా ఎంతో మంది వైద్యులను కలిసినప్పటికీ.. ఈ రంగు మారడానికి గల కారణమేంటో చెప్పలేకపోయారు.

తన పరిస్థితిని వివరిస్తూ.. టిక్​టాక్​లో ఒక వీడియో చేశాడు మాంక్. "నేను రంగులు మారుతున్నాను. దానికి కారణం ఏంటో.. వైద్యులకు కూడా తెలియట్లేదు" అంటూ అతను చేసిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిలియన్ల కొద్దీ మంది వీక్షించారు. మాంక్ పరిస్థితిని చూసి కొందరు నవ్వుకుంటే.. మరికొందరు బాధపడుతున్నారు. ఇంకొందరు ధైర్యం చెబుతున్నారు.

మొదట ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోయిన టైలర్.. ఆ తర్వాత మెల్లమెల్లగా వాస్తవాన్ని అంగీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతకు మించి చేసేది కూడా ఏమీ లేదని గుర్తిస్తున్నాడు. అయితే.. మళ్లీ తెల్లగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. టైలర్‌ను స్పెషలిస్ట్‌ల బృందం పరిశీలిస్తోంది. కానీ.. ట్రీట్​మెంట్​కు చాలా డబ్బు ఖర్చవుతోంది. దీంతో.. వైద్య ఖర్చుల కోసం తనకు సహాయం చేయాలంటూ.. విరాళాల సేకరణ కూడా ప్రారంభించాడు. మరి, టైలర్ తిరిగి పాత మనిషిగా మారిపోతాడో లేదో చూడాలి.

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.