తెలంగాణలోని హైదరాబాద్ బేగంపేట్ నుంచి ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్న ఆనంద్ అనే ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. తోటి ప్రయాణికులు 108, 100కు సమాచారమిచ్చారు. మలక్‌పేట రైల్వేస్టేషన్లో ఆనంద్‌ను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సు వచ్చింది. కానీ 108 వాహనం డోర్ 20 నిమిషాల పాటు తెరుచుకోకుండా సతాయించింది. చివరికి గ్లాస్ పగలగొట్టి తీసేలోపే ఆనంద్ మృతి చెందాడు. వాహనం డోర్ సరైన సమయానికి తెరుచుకుని ఉంటే ఆ వ్యక్తి బతికేవాడని ప్రయాణికులు వాపోయారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.
అంబులెన్స్ డోరు తెరుచుకోక వ్యక్తి మృతి - 108
ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తోటి ప్రయాణికులు వెంటనే అంబులెన్సుకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న అంబులెన్సు డోరు... 20 నిమిషాలైనా తెరుచుకోలేదు. గ్లాస్ పగలగొట్టి డోరు తీసేలోగా ఆ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ మలక్‌పేటలో చోటు చేసుకుంది.