ETV Bharat / city

'అంబటి రాంబాబు అక్రమ మైనింగ్​': హైకోర్టులో పిటిషన్ - Ambati Rambabu latest news

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్​కు పాల్పడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజుపాలెం వైకాపా కార్యకర్తల తరఫున పిల్ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్ విచారణ అర్హతపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. వైకాపా కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

'Ambati Rambabu is involved in illegal mining'
'అంబటి రాంబాబు అక్రమ మైనింగ్​కు పాల్పడుతున్నారు'
author img

By

Published : Aug 26, 2020, 3:36 PM IST

Updated : Aug 26, 2020, 4:43 PM IST

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ... హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజుపాలెం వైకాపా కార్యకర్తల తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్​లో పేర్కొన్నారు. పిటిషన్ విచారణ అర్హతపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది.

అక్రమ మైనింగ్ జరుగుతున్నందునే పిటిషన్ వేశానని పిటిషనర్ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరించారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వైట్ లైమ్ స్టోన్, మొజాయిక్ చిప్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని... రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

కలెక్టర్, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం జగన్‌కు పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని చెప్పారు. వైకాపా కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని న్యాయవాది నాగరఘు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

మూడు రాజధానులపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం

Last Updated : Aug 26, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.