ETV Bharat / city

హైకోర్టులో రాజధాని రైతుల వ్యాజ్యం

author img

By

Published : Feb 11, 2020, 10:15 AM IST

తమ ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని రాజధాని రైతులు హైకోర్టులో పటిషన్లు దాఖలు చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సీఆర్​డీఏ భూములను ఇతరులకు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

amaravati-farmers-petition-in-high-court
హైకోర్టులో రాజధాని రైతుల వ్యాజ్యం

అమరావతి ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేలా ఆదేశించాలని రాజధాని రైతులు వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఎమ్​.సత్యనారాయణమూర్తి ఈ పిటిషన్లపై విచారణ జరిపారు. భూసమీకరణలో తీసుకున్న భూముల్ని ప్రభుత్వం ఇతరులకు కేటాయించే ప్రయత్నం చేస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ పూర్తైయ్యే వరకు సీఆర్​డీఏకు చెందిన భూములను ఇతరులకు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. సకాలంలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వనందుకు పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ విషయంపై ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, సీఆర్​డీఏ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి :

సెలెక్ట్ కమిటీ దస్త్రం వెనక్కి... మండలి ఛైర్మన్​ నిర్ణయంపై ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.