ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు రోజులుగా నిలిచిన రాజధాని రైతుల మహా పాదయాత్ర(Amaravati farmers mahapadayatra) నేడు తిరిగి ప్రారంభమైంది. 20వ రోజు రాజధాని రైతుల మహా పాదయాత్ర గుడ్లూరు నుంచి యథావిధిగా మెుదలైంది.
పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి పొర్లుతుండటంతో.. అడ్డంకులు ఏర్పడి రెండు రోజుల పాటు విరామం ఇవ్వవలసి వచ్చిందని ఐకాస తెలిపింది. మహిళలు ఇబ్బందులు పడకూడదనే పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు నేతలు స్పష్టం చేశారు. నేడు ప్రకాశం జిల్లాలో రైతుల పాదయాత్ర 18 కిలోమీటర్లు సాగనుంది. సాయంత్రం కావలి మండలం రాజువారి చింతలపల్లిలో రైతులు బస చేస్తారు. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా రాజధాని రైతులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మహాపాదయాత్రకు రోజురోజుకూ ప్రజల నుంచి స్పందన పెరుగుతోందని అమరావతి రైతులు అన్నారు. తమకు లభిస్తున్న స్పందన చూసి ప్రభుత్వం(Government) తట్టుకోలేకపోతోందని విమర్శించారు. ఇప్పటికీ మంత్రులు మూడు రాజధానులు కట్టి తీరతామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. న్యాయస్థానం(Court)లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు
ఇదీ చదవండి:
Buildings collapsed: కదిరిలో కూలిన రెండు భవనాలు..ఇద్దరు చిన్నారులు మృతి.. శిథిలాల కింద పలువురు