రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు వివిధ రూపాల్లో నిరనస వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్వేషపూరితంగా తమ భూముల్లో ఇళ్ల స్థలాలను కేటాయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తుళ్లూరు, మందడం, వెలగపూడి ప్రాంతాల రైతులు అమరావతి నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నట్లు తమ సందేశాన్ని ప్రభుత్వానికి తెలియజేసేలా లఘునాటిక ప్రదర్శించారు. ప్రభుత్వం తమ మొర ఆలకించేంతవరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అమరావతిని కాపాడాలంటూ వెలగపూడిలో మహిళలు సాయిచాలీసా నిర్వహించారు. మందడంలో మహిళలు ఆందోళన చేశారు. రాజధానిలో జరిగే శుభ కార్యాల్లోనూ అమరావతి నినాదం జోరుగా వినిపించింది. వేడుకకు హాజరైన అతిథులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండీ... 'రాజధాని భూముల పంపిణీ సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధం'