.
సుప్రీంను ధిక్కరించి 144 సెక్షన్ అమలా..? - అమరావతిలో రైతుల దీక్షలను అడ్డుకున్న పోలీసులు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందని, దీక్షలకు అనుమతి లేదని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో గ్రామస్థులు టెంట్ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత నెలకొంది. భూములు ఇచ్చినందుకు మమ్మల్ని రోడ్లమీదకు ఈడుస్తారా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
amaravathi-protest-news-latest
.
Intro:Body:
Conclusion:
mandadam
Conclusion:
Last Updated : Jan 11, 2020, 12:11 PM IST