ETV Bharat / city

హస్తిన చేరిన అమరావతి పోరు - ఏపీ రాజధాని ఇస్యూ వార్తలు

అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలని రాజధాని రైతులు కేంద్ర మంత్రులను కోరారు. లోక్‌సభ స్పీకర్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి.. జగన్‌ సర్కారు వైఖరిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని సైతం ఇవాళ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Amaravathi farmers met central minister in delhi
హస్తిన చేరిన అమరావతి పోరు
author img

By

Published : Feb 4, 2020, 6:17 AM IST

హస్తిన చేరిన అమరావతి పోరు

అమరావతిని రక్షించి, భూములు త్యాగం చేసిన వారికి అన్యాయం జరగకుండా చూడాలంటూ కేంద్ర మంత్రులను అమరావతి రైతులు కోరారు. 3 రాజధానుల నిర్ణయం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కేంద్రానికి తెలిపేందుకు దిల్లీలో పర్యటిస్తున్న రైతులు, తెదేపా ఎంపీల ఆధ్వర్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ప్రహ్లాద్‌ జోషిని కలిసి తమ ఆవేదన వివరించారు. అన్ని పార్టీలూ అమరావతే రాజధానిగా ఉండాలంటున్నా సీఎం జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజధానిలో నిర్మాణం పూర్తైన భవనాల ఫొటోలను రైతులు చూపగా నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి సమస్యను తీసుకెళ్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.

సరైన సమయంలో.. కేంద్రం రంగంలోకి..

జగన్‌ సర్కారు ఇదేరీతిలో వ్యవహరిస్తే, వచ్చే 4ఏళ్లు డోలాయమానంలోనే కొనసాగడం తప్ప రాజధానిని కదిలించలేరని భాజపా ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. సమయం చూసి కేంద్రం రంగంలోకి దిగుతుందని తెలిపారు.

సోమవారం రాత్రి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబట్టి రైతులు నిరసన తెలిపారు.

ఇదీ చదవండి : రైతుల ఆందోళనలపై సీఎం స్పందించకపోవడం సరికాదు: వంగవీటి రాధ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.