అమరావతి ఉద్యమంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వాఖ్యలను రాజధాని మహిళలు తిప్పికొట్టారు. వైకాపా నేతలు ఇదే ధోరణిని అవలంభిస్తే ఆ పార్టీ దిగిపోయేంత వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో అమరావతే రెఫరెండంగా పోటీలో దిగుతామని తేల్చిచెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాంతం శ్మశానం, ఎడారిగా మారిందని మహిళలు మండిపడ్డారు.
పరిపాలన రాజధానిగా కొనసాగించాలంటూ... మహిళలు 501వ రోజు అమరావతి గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, నెక్కల్లు, బోరుపాలెం, వెంకటపాలెం, అనంతవరం, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:
ప్రాణాలకే భరోసా లేదు.. భవిష్యత్ గురించి ఏం ఆలోచిస్తారు?: చంద్రబాబు