నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం కక్షసాధింపు వీడటం లేదని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. హైకోర్టు తీర్పుపై అడ్వొకేట్ జనరల్ మీడియా ముందుకు వచ్చిన ఘటనలు లేవని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఒత్తిడితో హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ ఏజీ మాట్లాడటం దారుణమని వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ కొట్టివేసినా నిమ్మగడ్డ నియామకానికి అడ్డంకులు సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. అధికార పార్టీకి 151 ఎమ్మెల్యేలున్నా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందేనని హితవు పలికారు.
ఇదీ చదవండి: