మాన్సాస్ ట్రస్టు వ్యవహారం రోజుకో ములుపు తిరుగుతోంది. తాజాగా ట్రస్టు పరిపాలనా భవనాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకు తరలించేందుకు అనుమతి కోరుతూ ట్రస్టు ఈవో దేవాదాయశాఖకు లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని తెదేపా నేత అదితి గజపతిరాజు తీవ్రంగా ఖండించారు. మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని పక్క జిల్లాకు తరలించాలనే ప్రయత్నం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
సంస్థ దస్త్రాలన్నింటినీ ప్రస్తుతం కార్యాలయంలోనే ఉంచుతూ...కేవలం ఉద్యోగుల కోసం మాత్రం పద్మనాభంలో మరో కార్యాలయం ఏర్పాటు చేయటం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. మాన్సాన్కు సంబంధించిన వేల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. భూములను కాజేసే కుట్రలో భాగంగానే ఛైర్పర్సన్, కొందరు వైకాపా నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి