ETV Bharat / city

కాబోయే తెలంగాణ సీఎం కేటీఆర్​కు శుభాకాంక్షలు: నటుడు సుమన్

తెలంగాణ రాష్ట్రానికి త్వరలో ముఖ్యమంత్రి కాబోయే మంత్రి కేటీఆర్​కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నటుడు సుమన్ ప్రకటించారు. కేటీఆర్ లాంటి యువకుడు సీఎం అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. నిర్మాత సి.కల్యాణ్​తో కలిసి సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ప్రజాడైరీని ఆవిష్కరించారు.

author img

By

Published : Jan 25, 2021, 7:46 PM IST

actor suman best wishes to ktr
కాబోయే తెలంగాణ సీఎం కేటీఆర్​కు శుభాకాంక్షలు: నటుడు సుమన్
కాబోయే తెలంగాణ సీఎం కేటీఆర్​కు శుభాకాంక్షలు: నటుడు సుమన్

త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్న మంత్రి కేటీఆర్​కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నటుడు సుమన్ ప్రకటించారు. కేటీఆర్ లాంటి యువకుడు ముఖ్యమంత్రి అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని సుమన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్.. నిర్మాత సి.కల్యాణ్​తో కలిసి ప్రజాడైరీని ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకీ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ పోరాటం, సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ కల సాకారమైందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా కేటీఆర్ కావడం స్వాగతించదగ్గ విషయంగా పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్​కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.