ETV Bharat / city

అచ్చెన్నాయుడి పట్ల అంత కర్కశమా?: హైకోర్టు - అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు ఆర్డర్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి గుంటూరు రమేష్ ఆస్పత్రిలో వైద్యచికిత్సలు ప్రారంభమయ్యాయి. మెరుగైన వైద్య చికిత్స కోసం తనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న అచ్చెన్న అభ్యర్థనను హైకోర్టు అనుమతించగా.. ఆయన్ని రమేశ్‌ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు.....మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపింది. అచ్చెన్న ఆరోగ్యంపై వారానికి రెండు సార్లు నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

అచ్చెన్న వ్యవహారంలో అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

author img

By

Published : Jul 9, 2020, 6:05 AM IST

Updated : Jul 9, 2020, 6:15 AM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. శస్త్రచికిత్స చేయించుకున్న అచ్చెన్న అవస్థ గురించి తనకు తెలీదని అనిశా దర్యాప్తు అధికారి చెప్పడాన్ని విశ్వసించలేమని స్పష్టం చేసింది. అనిశా తరఫున ప్రత్యేక పీపీ వాదనలు వినిపిస్తూ ... పిటిషనర్ తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడ్డారని చెప్పారు. తీవ్ర నేరాలకు పాల్పడిన నిందితులకు సైతం రాజ్యాంగం కల్పించిన రక్షణను నిరాకరించడానికి వీల్లేదనే విషయాన్ని దర్యాప్తు అధికారి అర్ధం చేసుకోవాలని హైకోర్టు తేల్చిచెప్పింది. కనీస మానవ విలువలు, హక్కులకు విస్మరించకూడదని వెల్లడించింది. అచ్చెన్నతో వ్యవహరించిన తీరు, ఆయన్ని ప్రయాణించేలా చేయడం మరో శస్త్ర చికిత్సకు దారితీసిందని.... దీంతో పూర్తిగా బాధ నుంచి కోలుకోలేకపోయారని తేల్చిచెప్పింది. అచ్చెన్నాయుడ్ని మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని రమేశ్ ఆసుపత్రికి తక్షణం పంపాలని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్​ను ఆదేశించింది. పిటిషనర్​తో వ్యవహరించిన తీరు, గుంటూరు జనరల్ ఆసుపత్రి అథారటీ ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తన అధికారాన్ని వినియోగించి ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొంది. వారానికి 2 సార్లు అచ్చెన్నాయుడి ఆరోగ్య బులిటెన్‌ను హైకోర్టుకు సమర్పించాలని రమేశ్ ఆసుపత్రికి స్పష్టంచేసింది. అన్ని అంశాలకు సమాధానం ఇస్తూ అదనపు కౌంటర్ దాఖలు చేయాలని అనిశాతో పాటు ఇతర ప్రతివాదులను ఆదేశించింది.

ఆ రెండు లేఖల్లో...

కరోనా వ్యాప్తి దృష్ట్యా సబ్ జైలుకు బదులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలన్న పిటిషనర్ అభ్యర్థన పైనా కౌంటర్లో సమాధానం లేదని కోర్టు వెల్లడించింది. కలనోస్కోపీ చేయించుకున్న పిటిషనర్‌కు బయాప్సీ నివేదిక రాకముందే హడావుడిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు జులై 1న డిశ్చార్జి చేశారని ఆక్షేపించించింది . జూన్ 23న గుంటూరు ఆసుపత్రి అధికారులు ఇచ్చిన హెల్త్ బులెటన్​లో డిశ్చార్జికి మూడు, నాలుగు రోజులు పడుతుందని తెలిపారు. కానీ 24వ తేదీనే జైలు సూపరింటెండెంట్​కు లేఖ రాస్తూ పిటిషనర్​ను డిశ్చార్జి చేయొచ్చని రాశారు. ఈ రెండు లేఖలను పరిశీలిస్తే పిటిషనర్​తో ఎలా వ్యవహరించారో అర్థమవుతోందని కోర్టు పేర్కొంది. జిల్లా జైలు వైద్యాధికారి ఈనెల 4న ఇచ్చిన నివేదిక ప్రకారం పిటిషనర్ బాధతో ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేసింది. ఈ పరిణామాలన్ని స్పష్టమైన మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పడానికి సందేహించడం లేదని తేల్చిచెప్పింది. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యచికిత్సలకు కోర్టు అనుమతితో న్యాయం గెలిచిందని..అచ్చెన్న తరపున న్యాయవాది హరిబాబు అన్నారు.

హైకోర్టు ఆదేశాలతో విజయవాడ జైలు నుంచి ఎస్కార్ట్ మధ్య అంబులెన్స్ వాహనంలో అచ్చెన్నాయుడిని పోలీసులు గుంటూరు రమేశ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆసుపత్రికి వద్దకు చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అచ్చెన్నాయుడ్ని జైలు నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో అక్కడికి చేరుకున్న తెలుగుదేశం నేతలు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

ఇకపై అచ్చెన్నాయుడికి గుంటూరు రమేశ్ ఆస్పత్రి లో వైద్యచికిత్సలు కొనసాగుతాయి. అచ్చెన్నాయుడు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నందున పరామర్శించేందుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ప్రత్యేక భద్రతను చేపట్టారు.

ఇదీ చదవండి : రమేశ్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడు.. పోలీసుల భారీ బందోబస్తు

Last Updated : Jul 9, 2020, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.