ETV Bharat / city

Dating Survey 2021: డేటింగ్​లో తేలిపోతున్న యువత.. హైదరాబాదే నెంబర్ వన్ - డేటింగ్ యాప్స్

Dating Survey 2021: హాయ్‌‌‌‌..హ్యాండ్సమ్‌‌‌‌’ అని ఎవరైనా అమ్మాయి అంటే ఆ కుర్రాడి పని అయిపోయినట్టే. ఇక డేటింగ్‌‌‌‌ అంటూ ఆఫర్‌‌‌‌ ఇస్తే ఆగుతారా? దేనికైనా రెడీ అవుతారు. ఈ బలహీనతనే ఆసరాగా తీసుకున్న కొంతమంది జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇలా యువకులే కాదండోయ్.. యువతులు కూడా మోసపోతున్నారు. పైగా ఈ పోకడ భాగ్యనగరంలో మరింత పెరిగినట్లు ఇయన్ ఇన్ స్వైప్-2021 సర్వే తెలిపింది.

Dating
Dating
author img

By

Published : Dec 13, 2021, 9:49 AM IST

Dating Survey 2021: లాక్ డౌన్ సమయంలో డేటింగ్ యాప్‌ల వినియోగం తెలంగాణలో భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా మోసపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువైంది. అందమైన యువతులను, ఆకర్షించే మాటలను ఎరగా వేసి... అమాయకులను డేటింగ్ ఉచ్చులోకి లాగుతున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా... చాలా తెలివిగా వ్యక్తిగత సమాచారం, విలువైన డేటా సేకరించి… అందిన కాడికి దోచుకుంటున్నారు.

  • తెలంగాణలోని నిజాంపేట ప్రాంతంలో నివసించే ఓ యువతికి ఓ డేటింగ్‌ యాప్‌లో న్యూరో సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న వైద్యుడు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అతనికి అప్పటికే వివాహమైన సంస్కృతి తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
  • లంగర్‌హౌజ్‌కు చెందిన ఓ యువకుడికి ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా ఓ యువతి పరిచయమైంది. వీడియో కాల్‌ స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

ఊరు.. పేరు తెలియదు. ప్రొఫైల్‌ నచ్చిన వెంటనే మాట కలుపుతారు. చనువు పెరిగిన తరువాత అవతలివారి నిజస్వరూపం బయటపడుతుంది. హైదరాబాద్‌ నగరంలో ఈ పోకడ పెరిగింది. కరోనా తర్వాత ఆన్‌లైన్‌ వినియోగం పెరగడంతో చాలా మంది యువతీయువకులు డేటింగ్‌ యాప్‌ల మాయలో పడ్డారు.

వినియోగంలో ప్రథమ స్థానం..

Video Dating: వీడియో డేటింగ్‌లలో దేశంలోనే హైదరాబాద్‌ నగరం మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆన్‌లైన్‌ డేటింగ్‌ సంస్థ నిర్వహించిన ఇయన్‌ ఇన్‌ స్వైప్‌-2021 సర్వేలో ఇది తేలింది. తర్వాత స్థానాల్లో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, పూణె ఉన్నాయి. జనవరి 1 నుంచి నవంబరు 30 వరకు 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో ప్రధానంగా పిక్‌నిక్‌ ఇన్‌ ఎ పార్క్‌, వర్చువల్‌ మూవీ నైట్‌, సైక్లింగ్‌, పొట్టెరీ అంశాలపై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. వీడియోకాల్‌ వృద్ధిలో 52 శాతం సాధించినట్లు ఆ సంస్థ తెలిపింది.

డేటింగ్‌ యాప్‌ల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న మోసాల్లో 33 శాతం క్యాట్‌ ఫిషింగ్‌, 38 శాతం హానికరమైన లింక్‌లు లేదా అటాచ్‌మెంట్లు, 36 శాతం మంది ఫోన్లలో డేటా చోరీ జరిగినట్లు కాస్పర్‌స్కీ గ్లోబర్‌ సర్వేలో వెల్లడైంది. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, నోయిడా తదితర నగరాల్లో సర్వే నిర్వహించగా.. వారం రోజుల వ్యవధిలోనే 300 శాతం సబ్‌స్క్రిప్షన్‌ పెరిగిందని ఫ్రెంచ్‌ ఆన్‌లైన్‌ డేటింగ్‌ కమ్యూనిటీ వేదిక తమ నివేదికలో తెలిపింది.

దీర్ఘకాలంలో సమస్యలు ఉత్పన్నం

..

ఫేక్‌ ప్రొఫైల్స్‌ను గుర్తించడంలో చాలా మంది విఫలమవుతున్నారు. చాలా యాప్‌ సంస్థలు బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేయడం లేదు. ఇదొక సోషల్‌ మీడియాలాగా నిర్వహణ ఉంటోంది. విదేశీయుల డేటింగ్‌ సంస్కృతిలో స్థాయి భేదాలను పట్టించుకోరు. ఆ మనస్తత్వం, ప్రవర్తనలు ఇక్కడ చాలా మందిలో ఉండటం లేదు. కొందరు యువకులు.. యువతులతో కాస్త సమయం కేటాయించొచ్చని ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తొలుత బాగానే ఉన్నా.. దీర్ఘకాలంలో సమస్యలొస్తున్నాయి. నేరాలకు దారి తీస్తున్నాయి.

- నల్లమోతు శ్రీధర్‌, సాంకేతిక నిపుణుడు

ఇదీ చూడండి:

భరతమాత ముద్దుబిడ్డకు వీడ్కోలు.. అశ్రునయనాల నడుమ సాయితేజ అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.