ETV Bharat / city

'ఆంగ్ల మాధ్యమం' జీవోను రద్దు చేయండి - ఆంగ్ల మాధ్యమం జీవోపై పిల్

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 85ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. విద్యా హక్కు చట్టం- 2009 నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగం బాలలకు కల్పించిన హక్కుల్ని హరించేదిగా ఈ జీవో ఉందని పేర్కొంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

high court
హైకోర్టు
author img

By

Published : Dec 14, 2019, 6:15 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం(2020-21)నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 85ను నవంబర్ 20న జారీ చేసింది. అయితే దీనిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం రావిపాడు గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు రాంభొట్ల శ్రీనివాస సుధీష్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.విద్యాహక్కు చట్టం-2009 నిబంధనలకు విరుద్ధంగా... అధికరణ 21(ఏ) పిల్లలకు కల్పించిన హక్కుల్ని హరించేదిగా జీవో-85 ఉందని అందులో అభిప్రాయపడ్డారు.
వ్యాజ్యంలో పేర్కొన్న అంశాలు
'గత ప్రభుత్వం కొన్ని పాఠశాలల్లో తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని యత్నించింది. మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది లేక ఆ ప్రయత్నం వాస్తవరూపం దాల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం జీవో 85 తీసుకురావడం ద్వారా 1 నుంచి 6 తరగతి వరకు తెలుగు నుంచి ఆంగ్లమాధ్యమానికి మార్చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు... అధికరణ 21-ఏ పిల్లలకు కల్పించిన హక్కుల్ని హరించేవిగా ఉన్నాయి. విద్యా హక్కు చట్టం సెక్షన్ 29(2)(ఎఫ్) ప్రకారం పిల్లలకు బోధించే మాధ్యమం తప్పనిసరిగా మాతృభాషలో ఉండాలి. అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమాన్ని తీసుకొస్తున్నారు. కేంద్రం తెచ్చిన విద్యాహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ జీవో ఉంది. తెలుగు మాధ్యమం లేకుండా చేయడం....ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకోవడానికి నిరాకరించిన విద్యార్థుల హక్కుల్ని హరించడమే. తగినంతమంది ఉపాధ్యాయులు లేకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తూ కార్యనిరాహక ఉత్తర్వులు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ జీవోను రద్దు చేయండి' అని వ్యాజ్యంలో కోరారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్, రాష్ట్ర ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ కౌన్సిల్ డైరెక్టర్, కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి

'విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.