తెలంగాణలోని జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కృష్ణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే వల్లమాలిన అభిమానం. అది ఎంత వరకంటే తన ఇంటి ఆవరణలో ఆరడుగుల ఎత్తైన ట్రంప్ విగ్రహం ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహించే అంత. నిత్యం దేవుడికి పూజలు చేయడం మర్చిపోతాడేమో కానీ.. ట్రంపు విగ్రహానికి మాత్రం పూజ చేయడం మరువడు.
నాలుగు సంవత్సరాలుగా ట్రంప్‌ను ఆరాధిస్తున్న కృష్ణ... సంవత్సరం క్రితం ఏకంగా తన ఇంటి ఆవరణలో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. నిత్యం విగ్రహానికి పూలు, పాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నాడు. ఈనెల 24న భారతదేశ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అతని దర్శన భాగ్యం దొరకాలని కృష్ణ ఆశిస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే తన తలనీలాలు ఇస్తానని అంటున్నాడు.
ఇవీ చూడండి: