ETV Bharat / city

తెలంగాణ: పదిరెట్లు ఇస్తామని చెప్పారు.. రూ.​ 24 లక్షలు దండుకున్నారు​!

హైదరాబాద్​లో రోజురోజుకీ సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు జారీ చేస్తున్నా.. సైబర్​ నేరగాళ్ల మోసానికి భాగ్యనగర వాసులు బలవుతూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్​లోని ఓ వ్యాపారవేత్త వీరి ఉచ్చులో చిక్కి రూ. 24 లక్షలు కోల్పోయాడు.

cheating through facebook
ఫేస్ బుక్ ద్వారా మోసం
author img

By

Published : Nov 1, 2020, 10:53 PM IST

హైదరాబాద్​లో మరో సైబర్ క్రైమ్ ఉదంతం వెలుగుచూసింది. సికింద్రాబాద్​కు చెందిన ఓ వ్యాపారవేత్తకి ఫేస్​బుక్​లో రెండు నెలల క్రితం అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని యాక్సెప్ట్ చేసిన కొద్ది రోజులకు సదరు వ్యక్తి నుంచి ఓ సందేశం వచ్చింది. అందులో గత కొద్ది కాలంగా భారత్​లోని ఒక కంపెనీ నుంచి తమకు ఆయిల్ సరఫరా అయ్యేదని.. అకస్మాత్తుగా వారి నుంచి ఆయిల్ రవాణా ఆగిపోయిందని తెలిపారు. వారికి సంబంధించిన వివరాలు పంపిస్తామని చెప్పారు. కంపెనీ నుంచి ఆ ఆయిల్ కొనుగోలు చేసి పంపిస్తే దానికి పది రెట్లు చెల్లిస్తామని నమ్మించారు.

అది నమ్మిన ఆ వ్యాపారవేత్త వారిచ్చిన వివరాల ఆధారంగా ఆయిల్ కంపెనీని సంప్రదించి కొనుగోలుకు రూ. 24 లక్షలు చెల్లించాడు. అనంతరం ఇదంతా మోసం అని గ్రహించిన వ్యాపారవేత్త.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది నైజీరియన్ల స్కాంగా పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఔరా..! అచ్చం కార్పెట్​లానే ఉందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.