ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

.

ప్రధాన వార్తలు @9PM
ప్రధాన వార్తలు @9PM
author img

By

Published : Nov 16, 2020, 8:59 PM IST

  • కోర్టులపై అభ్యంతరకర పోస్టులు... సీబీఐ కేసు
    సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తులపై సామాజిక మాధ్య‌మాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన 17 మందిపై సీబీఐ ఎఫ్​ఐఆర్ న‌మోదు చేసింది. ఫేస్​బుక్, ట్విట్టర్ తదితర మాధ్యమాల్లో న్యాయ వ్య‌వ‌స్థపై అనుమానాలు క‌లిగే విధంగా దురుద్దేశంతో పెట్టిన పోస్టుల‌పై సీఐడీ చ‌ర్య‌లు స‌క్ర‌మంగా లేవ‌ని అభిప్రాయ‌ప‌డిన ఉన్న‌తన్యాయ‌స్థానం కేసును సీబీఐకి అప్పగించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • జిల్లాల పునర్​ విభజనపై సీఎం జగన్ సమీక్ష
    జిల్లాల పునర్ విభజనపై సీఎం సమీక్షించారు. కమిటీ అధ్యయనం, భౌగోళికంగా, సాంకేతికంగా తలెత్తుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రికి సీఎస్ నీలం సాహ్ని వివరించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఆర్థిక, పాలనాపరమైన అంశాలను కూడా చర్చించినట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • తిరుపతి ఉప ఎన్నిక వైకాపా ఓటమికి వేదికవ్వాలి: చంద్రబాబు
    త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వైకాపా ఓటమికి వేదిక కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పనబాక లక్ష్మిని ఉపఎన్నికల్లో పోటీకి పెట్టాలని నిర్ణయించిన ఆయన... అభ్యర్థి గెలుపునకు గట్టిగా ప్రయత్నం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాష్ట్రంలో తొలిసారి వెయ్యిలోపే కరోనా కేసులు
    రాష్ట్రంలో తొలిసారి వెయ్యిలోపే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 753 మంది వైరస్ బారినపడ్డారు. 13 మంది మహమ్మారితో మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఏడోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణం
    బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్​డీఏ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ ఏడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ఫాగు చౌహాన్‌.. నితీశ్​తో ప్రమాణం చేయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​కు కొవాగ్జిన్
    దిగ్గజ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ భారత్ బయోటెక్‌ తమ కరోనా వ్యాక్సిన్‌... కొవాగ్జిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్​ను సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ మేరకు సంస్థ సీఎమ్​డీ కృష్ణ ఎల్లా ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ''ప్రజాస్వామ్యం బలోపేతంలో మీడియా పాత్ర కీలకం'
    జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా నిర్వహించిన వర్చువల్ సమావేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తమ సందేశాలు అందించారు. కొవిడ్​ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • శుభవార్త: 94.5% ప్రభావవంతంగా మోడెర్నా టీకా!
    కొవిడ్​పై పోరాటంలో భాగంగా అమెరికా సంస్థ మోడెర్నా అభివృద్ధి చేసిన టీకాపై కీలక సమాచారం వెల్లడైంది. ఇటీవలే మూడోదశ ట్రయల్స్​ ప్రారంభించగా.. సంస్థ అధ్యయనంలో భాగంగా 94.5% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఒలింపిక్స్​ కోసం స్టేడియానికి వీక్షకులు: థామస్ బాచ్
    టోక్యో ఒలింపిక్స్​కు భారీగా సందర్శకులు వస్తారని ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ అభిప్రాయపడ్డారు. వారందరికీ టీకాలు ఇచ్చేందుకు ఒలింపిక్​ పాలక మండలి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మరణించడంలోనూ హాలీవుడ్​ నటుడు రికార్డు
    మనిషి జీవితంలో ఒక్క సారి మాత్రమే చనిపోతాడు. ఇది మాకు తెలిసిన విషయమే కదా అనుకుంటున్నారా? కానీ ఓ వ్యక్తి మాత్రం తన జీవితంలో ఏకంగా 43సార్లు మరణించి రికార్డుల్లోకెక్కారు. ఇదేలా సాధ్యమనుకుంటున్నారా? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.