- లక్షా 75 వేల కోట్లు దోచుకున్న జగన్.. ఇంటికొకరు రండి: చంద్రబాబు
వైకాపా సర్కార్ నవ రత్నాలు పేరుతో నవ ఘోరాలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్.. రూ. లక్షా 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అభివృద్ధిని గాలికొదిలేసి రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన మినీ మహానాడు సభలో ఆయన మాట్లాడారు.
- "మా బడి మాక్కావాలి.. మీ విలీనం మాకొద్దు"
పాఠశాలల విలీనంపై రాష్ట్రంవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడులు మూతపడితే.. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పాఠశాలల ఎదుట ఆందోళనకు దిగారు.
- జగనన్న లే-ఔట్లో కనీస సౌకర్యాలు లేవు : వైకాపా ఎమ్మెల్యే
నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పలువురు శాసనసభ్యులు తమ నియోజవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. తన నియోజవర్గంలో సమస్యలు పరిష్కరించటం లేదంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అద్దె బస్సులకు ఆర్టీసీ ఆహ్వానం
రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. జిల్లాలవారీగా వివిధ రకాల బస్సులు, సంఖ్య మేరకు టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాలని ఆర్టీసీ ఈడీ వెల్లడించారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు.
- కేంద్ర మంత్రి పదవికి నఖ్వీ రాజీనామా- ఉపరాష్ట్రపతిగా అవకాశం!
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్సీపీ సింగ్.. తమ పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు సమర్పించారు. బుధవారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో నఖ్వీ, ఆర్సీపీ సింగ్ దేశానికి చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.
- ముంబయిని ముంచెత్తిన వర్షాలు..
మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు ముంబయిని భారీ వానలు అతలాకుతలం చేశాయి. చాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు జలమయమయ్యాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
- బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. మరో నలుగురు మంత్రుల రాజీనామా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సర్కార్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేయగా.. తాజాగా మరో నలుగురు మంత్రులు అదే బాటలో నడిచారు.
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది.
- పీవీ సింధు, సాయి ప్రణీత్ శుభారంభం.. రెండో రౌండ్‌కు అర్హత
మాలేషియా మాస్టర్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సాయి ప్రణీత్ జోరు ప్రదర్శించారు. రెండు రౌండ్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో హి బింగ్ జియావొపై సింధు, కెవిన్ కార్డెన్పై ప్రణీత్ గెలిచారు.
- 'చిరు 'ప్రజారాజ్యం' కోసం ఆ పని చేశా.. అప్పుడే నా దశ తిరిగింది!'
సినీ పరిశ్రమలో తాను ఎదిగేలా మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రోత్సహించారని చెప్పారు దర్శకుడు మారుతి. చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ జెండాను తానే డిజైన్ చేశానని.. కొంతకాలం క్రితం ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కష్టపడి సంపాదించి, దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఓ సినిమా కారణంగా కోల్పోయానని చెప్పారు. ఆ సినిమా ఏంటి? తర్వాత మారుతి జీవితంలో ఏం జరిగింది?.. తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
TOP NEWS: ప్రధాన వార్తలు@9PM - ఏపీ ముఖ్యవార్తలు
.
TOP NEWS