ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఏపీ తాజా వార్తలు

ప్రధాన వార్తలు @ 9 PM

9PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 PM
author img

By

Published : Jul 13, 2021, 9:01 PM IST

  • 'పల్లెలు శుభ్రంగా ఉండాలి'
    పల్లెల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పల్లెలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు అన్నీ ఈ ఏడాదిలో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్యాంకు గ్యారంటీలను తెలియకుండా దాచారు: పయ్యావుల
    రాష్ట్ర ఖజానాకు సంబంధించి తాను చేసిన ఆరోపణలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి జవాబు సరిగా లేదని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు.బ్యాంకు గ్యారంటీలపై ప్రశ్న అడిగితే ఏడాది తర్వాత జవాబిచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు పొందుపరిచారా? లేదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు'
    గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను ఆయన పరామర్శించారు. ధూళిపాళ్ల నరేంద్రకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల
    కృష్ణా జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం
    ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నీట్'​ పీజీ పరీక్ష తేదీ ఖరారు
    నీట్​ పోస్ట్​గ్రాడ్యుయేట్(పీజీ)​ పరీక్ష తేదీని ఖరారు చేసింది కేంద్రం. సెప్టెంబర్​ 11న నిర్వహించనున్నట్లు విద్యాశాఖ​ మంత్రి మన్సుఖ్​ మాండవియా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాహుల్​తో పీకే భేటీ
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. దిల్లీలోని రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్​ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
    స్టాక్ మార్కెట్లు లాభాలను గడించాయి. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 397 పాయింట్లు పెరిగి.. 52,750 పైకి చేరింది. నిఫ్టీ (Nifty Today) 120 పాయింట్ల లాభంతో 15,800 మార్క్​పైన స్థిరపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి
    టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి భారత పతాకం రెపరెపలాడించాలని ప్రధాని అభిలాషించారు. జులై 23నుంచి ఈ మెగా క్రీడలు ప్రారంభంకానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే
    ఈ వారం పలు భాషల్లోని సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. కుడి ఎడమైతే(తెలుగు), తుఫాన్​(హిందీ), మాలిక్(మలయాళం) చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇవి కాకుండా ఇంకా ఏఏ సినిమాలు విడుదల కానున్నాయో తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.