ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - undefined

..

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM
author img

By

Published : Jul 22, 2022, 8:58 AM IST

  • పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత... పలువురి సంతాపం
    Pingali Venkaiah daughter: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సీతామహాలక్ష్మి మృతికి పలువురు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలవరం దిగువన మరో ప్రాజెక్టు లేదు: జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌
    Gajendra Singh: పోలవరం దిగువన మరో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన లేదని జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. ప్రాజెక్టులపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు షెకావత్‌ సమాధానమిచ్చారు. ఏమన్నారంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పేదల నోటి ముద్ద లాగేస్తారా?'.. కేంద్ర హెచ్చరికతో వరి రైతుల్లో ఆందోళన
    Rice distribution: నాలుగు నెలలుగా పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కార్డులకు బియ్యం కేటాయించాలని డిమాండ్​ చేస్తున్నారు. రాయితీ భారాన్ని దించుకునే ఎత్తుగడ వేసిందని ఆరోపిస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీ చేయకుంటే ధాన్యం సేకరణ నిలిపేస్తామన్న కేంద్ర మంత్రి హెచ్చరికతో... వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • New bars: కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌.. నేటి నుంచే దరఖాస్తు
    New bars: రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇవాళ్టి నుంచే దరఖాస్తు నమోదు ప్రారభం అవుతుంది. ఈ-వేలం ద్వారా కేటాయించే ప్రక్రియను అనుసరించనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.600 కోట్ల యావదాస్తి ప్రభుత్వానికి విరాళం.. ఒక్క ఇల్లు తప్ప!
    రూ.600 కోట్ల ఆస్తిని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు ఓ వ్యాపారవేత్త. ఈ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని కోరారు. ఆయనే యూపీకి చెందిన అరవింద్ కుమార్ గోయల్. ఒక్క ఇల్లు మినహా తన దగ్గర ఎటువంటి ఆస్తి ఉంచుకోలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రథమ పీఠంపై గిరి పుత్రిక.. భారీ ఆధిక్యంతో ముర్ము ఘన విజయం
    Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే. గురువారం దిల్లీలో ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లి అభినందనలు తెలిపారు. రక్షణ మంతి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా ఆమె నివాసానికి వెళ్లి మిఠాయి తినిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • లంక కొత్త అధ్యక్షుడిగా విక్రమసింఘె ప్రమాణం.. గొటబాయకు టూరిస్ట్​ వీసా!
    తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న లంక నూతన అధ్యక్షుడిగా రణిల్​ విక్రమసింఘె ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం 20-25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు, సింగపూర్​లో ఉన్న గొటబాయ రాజపక్సకు 14 రోజుల టూరిస్ట్​ వీసా మంజూరు చేశారు ఆ దేశ అధికారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • డ్రైవర్‌ లేని ఎలక్ట్రిక్​ కారు.. ధర ఎంతో తెలుసా?
    Driver Less Electric Car: చైనాకు చెందిన సెర్చ్​ ఇంజిన్​ సంస్థ బైదూ.. డ్రైవర్​ అక్కర్లేని విద్యుత్​ కారు 'అపోలో ఆర్‌టీ6'ను రూపొందించింది. బైదూకు చెందిన రోబో టాక్సీలో ఇదీ భాగం కానుంది. మరోవైపు, జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో '50 జారే ఎం ఎడిషన్‌'ను గురువారం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫైనల్​కు దూసుకెళ్లిన నీరజ్​ చోప్రా, అన్నురాణి
    ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న క్వాలిఫికేషన్​ రౌండ్​లో భారత అథ్లెట్లు అన్నురాణి, నీరజ్​ చోప్రా మంచి ప్రదర్శన చేశారు. ప్రత్యర్థుల కన్నా ఎక్కువ దూరం బల్లెం విసిరి ఫైనల్​కు దూసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Tollywood: ఈ వారసురాళ్లు యమా స్పీడు.. నిర్మాణంలో జోరు
    హీరో కొడుకు హీరో అవ్వొచ్చు. దర్శకుడి అబ్బాయి మెగాఫోన్‌ పట్టుకోవచ్చు. నిర్మాతల సంతానం నిర్మాతలవడం అరుదే. అందులోనూ అమ్మాయిలైతే చాలా కష్టం. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్‌ మారుతున్నట్లు కనిపిస్తోంది. కొందరు నిర్మాతలు, దర్శకులు, స్టార్‌ హీరోల వారసురాళ్లు కోట్ల రూపాయల వ్యవహారాల్నీ చాకచక్యంగా చక్కబెట్టేస్తామంటూ దూసుకొస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.