- దేశభక్తుల పురిటిగడ్డ ఆంధ్ర.. అల్లూరి స్ఫూర్తిని కొనసాగించాలి : ప్రధాని మోదీ
స్వాంతంత్య్ర సమరయోధుల కలల దేశంగా నవభారత్ ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. నవభారత నిర్మాణంలో కీలక భూమిక పోషించేందుకు యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి 125వ జయంతి వేడుకలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లూరి వారసులు, పలువురు స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు.
- 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించండి'.. ప్రధానికి జగన్ విజ్ఞప్తి
విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ కింద రూ.34,125 కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరారు. ఈమేరకు ప్రధానికి వినతిపత్రం అందజేశారు.
- ఆ జాబితా నుంచి రాత్రికి రాత్రే నా పేరు తొలగించారు: అచ్చెన్న
అల్లూరి జయంతి మహోత్సవాలకు పిలిచి తనను అవమానించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు తన పేరు పీఎంవో జాబితాలో ఉన్నా.. రాత్రికి రాత్రే తప్పించారని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం
అమరావతి రాజధానిలో రూ. 132 కోట్లతో అభివృద్ధి పనులను ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి రాజధానిలో అసంపూర్తిగా ఉన్న పనులను దశల వారీగా పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు.
- 'మహా' బలపరీక్షలో నెగ్గిన సీఎం శిందే.. మరోసారి సుప్రీంకు ఠాక్రే వర్గం
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగిసింది. నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. సోమవారం జరిగిన బలపరీక్షలో నెగ్గారు. 164 మంది ఎమ్మెల్యేలు శిందేకు మద్దతుగా నిలిచారు. మరోవైపు, శివసేన చీఫ్ విప్‌గా సునీల్ ప్రభును తొలగించి.. భరత్ గోగావలేను నియమించిన నేపథ్యంలో ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
- లోయలో పడ్డ బస్సు.. పిల్లలు సహా 12 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులు, స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు సైతం ఉన్నారని జిల్లా అధికారులు తెలిపారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
- అమెరికా పౌరసత్వాల్లో మనదే హవా!.. ఎంత మందికి ఇచ్చారంటే?
అమెరికాలో కొత్తగా పౌరసత్వం పొందినవారిలో భారతీయులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. మెక్సికో తర్వాత భారత్‌కు చెందినవారికే పౌరసత్వాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ విషయం అమెరికా వెల్లడించిన గణాంకాల్లో స్పష్టమైంది.
- '28% పన్ను బాదుడు తప్పదు.. జీఎస్టీ పరిధిలోకి చమురు అప్పుడే!'
జీఎస్టీ స్లాబుల్లో మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్. 28శాతం రేటు ఇకపైనా కొనసాగుతుందని చెప్పారు. పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు మరింత సమయం పట్టొచ్చని అన్నారు.
- ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డు
టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ బుమ్రా.. మరో ఘనత సాధించాడు. ఇంగ్లాడ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
- హీరో మాధవన్‌పై రజనీకాంత్ కామెంట్స్.. ఏమన్నారంటే?
'రాకెట్రీ' సినిమాపై ప్రశంసలు కురిపించారు సూపర్‌స్టార్ రజనీకాంత్. నంబి నారాయణన్ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే గొప్ప దర్శకులతో సమానమని మాధవన్ నిరూపించుకున్నారని అన్నారు.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
9 PM TOP NEWS