ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు.. 56 మరణాలు

author img

By

Published : Apr 28, 2021, 12:16 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,061 మందికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 56 మంది వైరస్​తో మరణించారు.

new corona cases in Telangana
new corona cases in Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు వైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు నిర్ధరణ పరీక్షలు కొరవడుతున్నాయి. తాజాగా కేవలం 82,270 మందికి మాత్రమే కొవిడ్​ పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నిత్యం లక్షకు పైగా టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. యాంటీ జెన్ కిట్ల కొరతతో నిర్ధరణ పరీక్షల కోసం వచ్చే ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

56 మంది బలి

గడిచిన 24 గంటల్లో 8,061 మందికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి సోకిన వారి సంఖ్య 4,19,966కు చేరింది. మరో 5,093 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 3,45,683 మంది కోలుకున్నారు. 56 మంది వైరస్​తో మరణించగా.. కరోనా ఇప్పటివరకు 2,154 మందిని బలి తీసుకుంది. రాష్ట్రంలో రికవరీ రేటు 82.31 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 72,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా

తాజాగా వచ్చిన కేసుల్లో ఆదిలాబాద్ జిల్లాలో 125, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82, జీహెచ్​ఎంసీ పరిధిలో 1,508, జగిత్యాల జిల్లాలో 252, జనగామ జిల్లాలో 88, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 68, జోగులాంబ గద్వాల జిల్లాలో 82, కామారెడ్డి జిల్లాలో 202, కరీంనగర్ జిల్లాలో 275, ఖమ్మం జిల్లాలో 277, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 79, మహబూబ్ నగర్ జిల్లాలో 328, మహబూబాబాద్ జిల్లాలో 97, మంచిర్యాల జిల్లాలో 171, మెదక్ జిల్లాలో 127, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 673, ములుగు జిల్లాలో 47, నాగర్ కర్నూల్ జిల్లాలో 188, నల్గొండ జిల్లాలో 311, నారాయణపేట జిల్లాలో 40, నిర్మల్ జిల్లాలో 109, నిజామాబాద్ జిల్లాలో 291, పెద్దపల్లి జిల్లాలో 145, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 142, రంగారెడ్డి జిల్లాలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, సిద్దిపేట జిల్లాలో 253, సూర్యాపేట జిల్లాలో 185, వికారాబాద్ జిల్లాలో 276, వనపర్తి జిల్లాలో 146, వరంగల్ రూరల్ జిల్లాలో 191, వరంగల్ అర్బన్ జిల్లాలో 203, యాదాద్రి భవనగిరి జిల్లాలో 213 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

1.29 శాతం వృథా..

ఇప్పటి వరకు రాష్ట్రంలో 38,48,591 మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా... అందులో 5,49,898 మందికి రెండో డోస్ సైతం వ్యాక్సినేషన్ పూర్తైంది. రాష్ట్రంలో కేవలం 1.29 శాతం వ్యాక్సినే డోస్​లు వృథా అవుతునట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి :

రెమ్‌డెసివిర్‌ దందా.. అమ్మకాలు సాగిస్తున్న మెడికల్‌ రిప్‌లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.