పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ… రైతులు, మహిళలు 503వ రోజు ఆందోళనలు చేశారు. కరోనా నేపథ్యంలో… ఇంటి వద్దే నిరసన తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. వెలగపూడి, నెక్కల్లులో రైతులు, మహిళలు నిరనస దీక్షలు కొనసాగించారు.
కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం సరైన సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచలేదని విమర్శలు గుప్పించారు. ఆస్పత్రుల్లో వెంటనే ఆక్సిజన్, ఇతర మందులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఈ ఏడాది కౌలు డబ్బులు వెంటనే విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
వ్యాక్సిన్ల కొనుగోలు పేరుతో.. ఉద్యోగుల జీతాల్లో కోత సరికాదు: పట్టాభి