ETV Bharat / city

నాగార్జున సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం - నాగార్జున సాగర్​ 5 గేట్లు ఎత్తివేత తాజా వార్త

తెలంగాణలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 5 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్​ వే ద్వారా 74 వేల 865 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.

నాగర్జున సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం
నాగర్జున సాగర్​కు తగ్గిన వరద ప్రవాహం
author img

By

Published : Sep 13, 2020, 5:15 PM IST

తెలంగాణలోని నాగార్జునసాగర్ జలాశయంలో వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. సాగర్ జలాశయం దాదాపుగా పూర్తి స్థాయిలో నిండి ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో లక్ష 15 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దానితో జలాశయం 5 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్​వే గుండా 74,865 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 311.92 టీఎంసీలకు చేరుకుంది. ఈ క్రమంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం సాగర్ జలాశయం నుంచి లక్ష 15 వేల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా వెళ్తోంది.

ఇదీ చదవండి

కృష్ణా- గోదావరి బేసిన్​లో భారీగా మీథేన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.