ETV Bharat / city

తెలంగాణకు చేరుకున్న 3 లక్షల కొవిషీల్డ్ టీకాలు

author img

By

Published : Apr 29, 2021, 5:05 PM IST

తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల కొవిషీల్డ్ టీకాలు వచ్చాయి. వీటిని కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వకేంద్రంలో నిల్వచేయనున్నారు.

vaccine
vaccine

తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల కొవిషీల్డ్ టీకాలు వచ్చాయి. వీటిని కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వకేంద్రంలో నిల్వచేయనున్నారు. అక్కడ నుంచి అవసరం ఉన్న ప్రాంతాలకు టీకాలను పంపించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. తాజాగా టీకాల కొరత ఏర్పడినా... నేడు 3 లక్షల కొవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి వచ్చాయి.

ప్రభుత్వం రోజూ లక్ష నుంచి లక్షన్నర వరకూ టీకాలు వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో ఈ రోజు వచ్చిన టీకా డోసులు కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది. ఇవాళ పలుచోట్ల వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకాలు లేవన్న బోర్డులు కనిపించాయి. ఇప్పుడు కేంద్రం నుంచి వ్యాక్సిన్ రావడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 46.53లక్షల డోసులు పంపగా.. ఇప్పటికే 45,36641 డోసులు వినియోగించారు.

ఇదీ చూడండి: ఫలితాల వెల్లడిలో అదే జాప్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.