రాజధాని రైతుల ఉద్యమం 298వ రోజుకు చేరింది. రాజధాని గ్రామాలలో అమరావతికి మద్ధతుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు, మహిళలు ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన చేపట్టారు. రాజధాని ఇక్కడ ఉండకపోతే ఉరే శరణ్యమని రైతులు నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఆరు సంవత్సరాలు కౌలు ఇచ్చిందని... మిగిలిన నాలుగేళ్లు ముగిసిన తర్వాత తమ పరిస్థితి ఏంటని? రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇదీ చదవండి