మూడు రాజధానులు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఉద్యమం 275 వ రోజుకు చేరుకుంది. తాళ్లాయపాలెం పుష్కరఘాట్ వద్ద ఉద్దండరాయునిపాలెం రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. నల్ల బెలూన్లు వదిలి.. కృష్ణానదిలో మోకాళ్లపై నిల్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ మహిళలు కృష్ణమ్మకు పూజలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకొని పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రైతులు తమ మొర ఆలకించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి..